భారతదేశ సమైక్యత ఐక్యత కోసం పటేల్ సేవలు మరువలేనివి, పటేల్ విగ్రహ ఏర్పాటుకై ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీ, ఎంపీ చొరవ తీసుకోవాలని కోరిన సర్దార్ పటేల్ అసోసియేషన్ నేతలు,

జయంతి 

Kura Yadaiah |October 31,2025,

హిందు 9 న్యూస్ డెస్క్ :

Sardar Patel|  తాండూరులో సర్దార్ పటేల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు………

Sardar Patel|  సర్దార్ వల్లభాయ్ పటేల్ 15వ జయంతిని తాండూర్ లో ఘనంగా నిర్వహించారు. సర్దార్ పటేల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ పార్టీ నాయకులు యువకులు మహిళలు పాల్గొని సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతదేశ సమైక్యత ఐక్యత కోసం సర్దార్ పటేల్ ఎంతగానో కృషి చేశారని వారి ఆశయాల సాధన దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు కదలాలని వక్తలు మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం మున్సిపల్ కౌన్సిల్లో ఏకగ్రీవంగా సర్దార్ పటేల్ విగ్రహానికి తీర్మానం చేస్తే ఇప్పటివరకు సర్దార్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేయకపోవడం ఏంటని విచారం వ్యక్తం చేశారు.

 

-ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ విగ్రహ ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలి,

మల్లప్పడిగ ప్రాంతంలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో సర్దార్ పటేల్ విగ్రహం ప్రతిష్ట కోసం అన్ని పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ కలిసి తక్షణ చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ కోటం సిద్దలింగం గడ్డం వెంకటేష్ జోసెఫ్ రాయల్ రాజ్ కుమార్ టైలర్ రమేష్ నాగారం మల్లేశం కృష్ణ ముదిరాజ్ రజనీకాంత్ మహేష్ భద్రేశ్వర్ అనిల్ బాండ్ ఠాగూర్ చౌకీదర్ చందు మంతటి రాజు యాసర్ పరమేష్ అజయ్ పర్యాద రామకృష్ణ అనిత జగదీశ్వరి వాసు మహేష్ శేఖర్ వినోద్ రామ్ బ్రహ్మం తదితరులు ఉన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *