40, ఏళ్ల తర్వాత తాండూర్ గడ్డపై మళ్లీ పునర్జీవం పోసుకున్న Pdsu -విద్యారంగాన్ని ఎండబెడుతున్న పాలకవర్గాలపై పాత గుర్తులతో పోరు జెండా ఎత్తండి, విద్యార్థులకు పిలుపునిచ్చిన జార్జిరెడ్డి (మిత్రుడు )బి ,ప్రదీప్

విద్యా రంగం, పోరాటాలు ,

Kura Yadaiah|November 24,2025,

హిందు 9 న్యూస్ బ్యూరో :-

 

Pdsu| tdr| 40 ఏళ్ల తర్వాత తాండూర్ గడ్డపై Pdsu జెండా రాష్ట్ర  అగ్రనాయకత్వం నేతృత్వంలో మళ్లీ రెపరెపలాడి విద్యార్థుల కు పాత రోజులను గుర్తు చేస్తూ విద్యారంగ సమస్యలపై పోరాటం ఉదృతం చేయాలని పిలుపునిచ్చిందిpdsu,

Pdsu tdr|తాండూర్ :-ఒకనాడు  40 ఏళ్ల కిందట తాండూరులో పిడిఎస్ యు విద్యార్థి సంఘం విద్యార్థుల సమస్యలపై చురుగ్గా పనిచేసింది. ఆనాడు ఈ ప్రాంత విద్యా విధానాలపై ఈ ప్రాంత సమస్యలపై సుదీర్ఘ కాలం పాటు  ఇక్కడి విద్యార్థులు  పిడిఎస్ లో చేరి పనిచేసిన  గుర్తులు ఇంకా మిగిలి ఉన్నాయి నాటి నేటి జూనియర్ కాలేజీ నుండి విద్యార్థి లోకం ఏర్పుజడాలను ఎత్తుకొని బస్టాండు నుండి చౌరస్తా మీదుగా ర్యాలీగా కదిలి విద్యార్థుల సమస్యలను ఆనాటి పాలకవర్గాలకు వినిపించారు. విద్యార్థి సమస్యలపై ఒక ఊపు ఊపిన పిడిఎస్యు విద్యార్థి నాయకులు వెరే వెరే మార్గాల వైపు వెళ్లడంతో మెల్లమెల్లగా పోరాట రూపాన్ని తగ్గించుకున్నది పిడిఎస్యు ఆ దిశలోనే కనుమరుగవుతూ వచ్చింది.

40 ఏళ్ల తర్వాత తాండూర్ గడ్డపై పునర్జీవం పోసుకున్న pdsu ,

మళ్లీ 40 ఏళ్ల తర్వాత స్థానిక విద్యార్థి సంఘం నేత న్యాయవాది పట్నం శ్రీనివాస్ నాయకత్వంలో  విద్యార్థి సమస్యలపై విద్యా విధానాలపై జాతీయ నూతన విద్యా విధానాలపై కార్పొరేట్ విద్యా వ్యవస్థ సృష్టిస్తున్న సమస్యలపై ఫీజుల దోపిడిని వ్యతిరేకిస్తూ ఈ ప్రాంత గడ్డపై pdsu పునర్జీవం పోసుకుంది. ఆ సంఘం నేను ఉన్నాను నేను జార్జిరెడ్డి శ్వాసను జంపాల ఊపిరిని రంగవల్లి మాటలు మారోజు వీరన్న పాటను నేను పిడిఎస్యును మీకు అండగా ఉన్నాను అందుకోండి జెండా అంటూ మళ్లీ ఈ గడ్డపై శీను నాయకత్వంలో పోరు మొదలుపెట్టి సోమవారం రోజు తాండూరు పురవీధుల గుండా విద్యార్థులలో నూతన ఉత్తేజాన్ని నింపుతూ ఎరుపువనితో కూడిన ఆనాటి జెండాను ఈ ప్రాంతానికి మళ్లీ పరిచయం చేశారు విద్యార్థులు. విద్యార్థుల సమస్యలపై ర్యాలీగా గళం విప్పు జెండా దిమ్మి వద్దకు చేరుకున్నారు.

జిల్లా నాల్గవ మహాసభలు,

అనంతరం ఆ సంఘం నాలుగో మహాసభలను తాండూర్ లోనే శ్రీనివాస్ అధ్యక్షతన సోమవారం రోజు తాండూర్ పట్టణంలో ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా అని 40, ఏళ్ల తర్వాత తాండూర్ గడ్డపై విద్యార్థుల భారీ ర్యాలీతో ఆనాడు జార్జి రెడ్డి నాయకత్వంలో పురుడుబోసుకున్న పిడిఎస్యు జెండా మళ్లీ రెపరెపలాడింది. ఈ జెండా ఆవిష్కరణలు జాతీయ రాష్ట్రస్థాయి పిడిఎస్యు నేతలతో పాటు జిల్లా స్థాయి పిడిఎస్యు నాయకులు విద్యార్థులతో జెండా ఆవిష్కరణ ప్రాంతం ఎరుపు వన్యగా మారింది.

-విద్యారంగాన్ని ఎండబెడుతున్న పాలకవర్గాలపై పాత గుర్తులతో ఓరు జెండా ఎత్తండి, జార్జి రెడ్డి “మిత్రుడు “బి ప్రదీప్

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆనాటి జార్జిరెడ్డి ( దోస్త్) మిత్రులు బి ప్రదీప్ హాజరై పిడిఎస్ కు ఉన్న సుదీర్ఘమైన పోరాట చరిత్రను తన మిత్రులు జార్జిరెడ్డి ఉస్మానియా కేంద్రంగా స్థాపించిన పి డి ఎస్ యు లక్ష్యాలను విజయాలను విద్యార్థి లోకానికి అంచలంచెలుగా జార్జి రెడ్డి మొదలు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ శ్రీపాద శ్రీహరి కోలా శంకర్ రంగవల్లి మారోజు వీరన్న లాంటి విద్యార్థి అమరుల త్యాగాలు విద్యార్థి లోకానికి ఒక్కసారి గుర్తు చేశారు. జార్జి రెడ్డి పేరు చెప్పగానే ఆ పేరు విన్న ఆనాడు ఆయన చేసిన పోరాట రూపాలను చూసిన అక్కడున్న అనేకమంది మేధావులను భావోద్వేగానికి గురిచేశాయి. జార్జి రెడ్డి ఉదాంతాన్ని ఒకంతకు వేదికపై ప్రస్తావిస్తూ ఉన్న సందర్భంలో ఆ ప్రాంతమంతా నిర్మానుషంగా మారి అందరూ చడి చప్పుడు లేకుండా  వినవాల్సి వచ్చింది. పోరాటాలలో త్యాగాలు ఎంత విలువైనయో విద్యార్థి లోకానికి పోరు ఎత్తుగడలను చాటి చెప్పారు ప్రదీప్. ఎంతోమంది మతోన్మాద శక్తులు pdsu ను ఆదిలోనే అంతమొందించాలనుకున్నారు. సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రలు పన్నారని ప్రదీప్ ఆరోపించారు. అది సాధ్యం కాలేకపోయిందని ఇంతింతై వట్టిడింతై అన్నట్లుగా ఒక్క గొంతు వేల గొంతులుగా ఈ రాష్ట్రంలో పిడిఎస్ యు ఉస్మానియా కేంద్రంగానే పనిచేస్తూ  పక్క పట్టణాలకు పరవళ్ళు తొక్కిందని ప్రదీప్ తెలిపారు.

పేద విద్యార్థుల పక్షాన నిలబడి విద్య ఉద్యోగ అవకాశాలు దక్కాలని నిర్విరామ పోరాటాలు నిర్వహించిందని పేర్కొన్నారు. పిడిఎస్యు అంటేనే ఒక చరిత్రని ఆ చరిత్రను తుడిచి వేయడం ఎవరి నుండి సాధ్యం కాదని తేల్చి చెప్పారు. నేటికీ విద్య పేదరికానికి అందకుండా పోతున్నదని ప్రభుత్వాల నూతన విద్యావిధానాల వల్ల విద్యా కార్పొరేటీకరణ అంతకంతకు పెరిగిపోయిందని పీడిత తాడిత బడుగుల పిల్లలకు చదువు అనే పదం దూరమవుతూ వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలు మారిన పాలకులు మారిన పార్టీలు ఎన్నికల ముందు ఇస్తున్న వాగ్దానాలను అప్పటి పూర్తికి చెబుతూ ఎన్నికలు అయిన తర్వాత ఆ ఉసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం 2020 ను తీసుకొచ్చి పేద విద్యార్థులకు ఉన్నత విద్యలు అందకుండా వారికి ఆమడ దూరం పెట్టారని ఆరోపించారు. యుజిసి నిబంధనలను మార్చి ప్రభుత్వం యూనివర్సిటీలను నాశనం చేస్తున్నదని 12 ఏళ్లుగా అధికారాన్ని తమ దగ్గర ఉంచుకున్న బిజెపి ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్ ఫెలోషిప్ పెంచకుండా వాటిలో మరి కోతలను విధించడం ఆ ప్రభుత్వానికి తగునా అంటూ ప్రశ్నించారు. దేశభక్తి జాతీయత మాటున పచ్చి అవకాశవాద కార్పొరేట్ విధానాలను పాలకవర్గాలు అవలంబిస్తున్నాయని ఘాటుగా మండిపడ్డారు.

ప్రశ్నించే వ్యక్తులను శక్తులను నిర్బంధిస్తున్నారు,

బిజెపి విధానాలను ప్రశ్నిస్తున్న వ్యక్తులను శక్తులను జైల్లో నిర్బంధిస్తూ వారిని అంతమొందించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపణలు గుప్పించారు. అనేక హక్కులను చట్టాలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు నూతన విద్యా విధానాలపై కార్పొరేట్ శక్తులపై కార్పొరేట్ విద్యా వ్యవస్థపై బలమైన పోరాటం నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని ఒకనాడు ఈ ప్రాంతంలో ఆనాటి విద్యార్థుల నాయకత్వంలో నడిచిన సాళ్లలో మళ్లీ పి డి ఎస్ యు  తాండూరు గడ్డపై పోరు మొదలు పెట్టాలని అది విద్యా విధానాలు  విద్యార్థుల సమస్యలపై స్థానిక విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలపై  గల మెత్తాలని పిలుపునిచ్చారు.

ప్రజాపాలన వారోత్సవాలు కాదు విద్యార్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి, పుడపంగి నాగరాజు

రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా తన అధికారాన్ని చెలాయించిన నేటికీ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా విద్యార్థులకు సమస్యలు పరిష్కరించడం లేదని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుడపంగి నాగరాజు మండిపడ్డారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజాపాలన ఉత్సవాలను కాదు ప్రజలు పాలక పార్టీలను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలంటే ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసం పెంచుకోవాలంటే నమ్మకం పెరగాలంటే అదే వేల కోట్ల రూపాయలు విద్యార్థుల స్కాలర్షిప్లు ఫెలోషిపులను విడుదల చేసి ఫీజు రీయింబర్స్మెంట్ లాంటిదాన్ని కొనసాగిస్తే ఎంతోమంది పీడిత తాడిత పేద ప్రజల పిల్లలు చదువుకుంటారని వారి భవిష్యత్తును కుటుంబాల కలలను నిలబెడతారని  ప్రభుత్వానికి సూచించారు. ప్రజా పాలన ద్వారా ప్రజల సొమ్ము దుర్వినియోగం కావడమేనంటూ ఆరోపించారు. విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇప్పటికీ సరిపడా నిధులు కేటాయించకపోవడం వల్ల  పాఠశాలలు ఇంకా అభివృద్ధిలోకి రావడం లేదని సరిపడా నిధులు కేటాయించి విద్యా సమస్యలను పరిష్కరించాలని హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం వారు ఉండేందుకు వసతి సౌకర్యాన్ని నాణ్యతతో కూడిన సౌకర్యాలను కల్పించాలని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యారంగ వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ కార్యక్రమానికి తాండూరు నుండి మళ్లీ పాత పిడిఎస్ యు తరహాలో పోరాటాలను గుర్తు చేసే విధంగా విద్యార్థులు సంఘంలో చేరి తమ సమస్యల కోసం ఉద్యమించాలని విద్యార్థులను కోరారు.

వామపక్ష సంఘాలు కలిసి పోరాడాలి సోమశేఖర్

ఈ ప్రాంతంలో పి డి ఎస్ యు ఎస్ ఎఫ్ ఐ  అనేక విద్యాసంస్థలు విద్యార్థుల సమస్యల కోసం ఆనాడు పోరాటం చేశాయని ఇప్పుడు కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు తాండూరు ప్రాంతంలో విద్యార్థుల హక్కుల కోసం కలిసి ముందుకు నడవాలని అప్పుడే వామపక్ష శక్తుల విలువలు ప్రభుత్వాలకు తెలిసి వస్తాయని తెలంగాణ ఉద్యమకారుడు సోమశేఖర్ అన్నారు. ఆర్ ఎస్ యు తో పాటు అనేక విద్యార్థి సంఘాలు ఇక్కడ పని చేసిన నేపథ్యం ఉందని గుర్తు చేశారు.

విద్యార్థి సమస్యలతో పాటు ప్రాంత సమస్యలు తెలుసుకోండి, మర్యాద రామకృష్ణ,

విద్యార్థుల సమస్యలతో పాటు ప్రభుత్వాలు తీసుకొస్తున్న నూతన విద్యా విధానాలను విద్యార్థులు తెలుసుకుంటూనే తమ తల్లిదండ్రులు కలలుగన్న కలల పంటలను విద్యార్థులు నిజం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ లెక్చరర్ ఫోరం పర్యాద రామకృష్ణ అన్నారు.  విద్యా సమస్యలతో పాటు ప్రాంత సమస్యలపై కూడా విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రాంత సమస్యలు అవగాహన లేని ఎంతోమంది పాలకులను మనం చట్టసభల్లోకి పంపుతున్నామని అలా పంపడానికి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు మనమందరం కూడా కారణమేనని ఆయన తన మనోగతాన్ని గుర్తు చేశారు.  ఇది ముందే పారిశ్రామిక ప్రాంతం ఇక్కడ ఇప్పటికీ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు అనేక కళాశాలలు ప్రభుత్వపరంగా నిర్మాణం జరిగి ఉండేవని ఆయన అన్నారు.

ఈ ప్రాంతం నుండి మైనింగ్ స్టోన్ పాలిష్ నుండి దాదాపుగా 150 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నామన్న లెక్చరర్,

ఈ ప్రాంతం నుండి ప్రభుత్వానికి మైనింగ్  స్టోన్ పాలిష్ యూనిట్ల నుండి దాదాపుగా 150 కోట్లు టాక్స్ ను చెల్లిస్తున్నామని విద్యార్థులకు వివరించారు.  ఇంత ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చుతున్న మన విద్యార్థులకు ఇంకా మౌలిక వసతులు కనీస వసతులు కరువవుతున్నాయని రోడ్లు కూడా సరిగ్గా లేవని ఇంత టాక్స్ ప్రభుత్వానికి పంపుతున్న మనకు ఏమి ఒరిగిందని ఆయన పేర్కొన్నారు. మీ విద్యా సమస్యలతో పాటు మీ భవిష్యత్తు తో పాటు మీ తల్లిదండ్రుల కలలను ఆశయాలను నిజం చేస్తూనే భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుంటూ విద్యారంగా సమస్యలతో పాటు ప్రాంత సమస్యలపై గొంతులు విప్పాలని సూచించారు.

 

 

కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ ఝాన్సీ పిఓడబ్ల్యు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వై గీత ప్రముఖ విద్యావేత్త రంగారావు ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి మల్లేష్ పిడిఎస్యు ప్రధాన కార్యదర్శి ఖనపురం రాజేష్ పి డి ఎస్ యు డివిజన్ అధ్యక్షులు నవీన్ జిల్లా నాయకులు జైపాల్ అశోక్ శ్రీకాంత్ అశోక్ స్వేరో జిల్లా నేత శివ, వెంకట్ చిన్న ధనరాజ్ విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *