రాజకీయం
Kura Yadaiah December 28,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :-

కాంగ్రెస్ పార్టీ పేదల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ అని తాండూర్ కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ అన్నారు….
తాండూర్ :-కాంగ్రెస్ పార్టీ పేదల అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం నాటినుండి నేటి వరకు పేదలకు అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ అన్నారు. ఆదివారం రోజు తాండూర్ లో కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అభిబ్ లాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జండా కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరిస్తూ ఈ సందర్భంగా అన్నారు.

పేదల సంక్షేమం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి భారత ప్రజల అభ్యున్నతి కోసం ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీ పుట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. కార్యక్రమంలో వడ్డే శ్రీనివాస్ జిలాని రవి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
