by kura |Yadaiah October 23,2025,
హిందు 9 న్యూస్ డెస్క్ :
వికారాబాద్ జిల్లా ధారూర్ మండలానికి చెందిన ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గురువారం రోజు నామినేషన్ దాఖలు చేశారు.
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా దారూర్ మండలానికి చెందిన ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం రోజు ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందించి ఎన్నికల బరిలో నిలబడుతున్నట్లు ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ ప్రకటించారు. తన ఉద్యోగ ధర్మంగా ప్రొఫెసర గా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే సామాజిక చైతన్య కార్యక్రమాలు మానవ హక్కు లు సామాజిక సేవ కార్యక్రమాల నేపథ్యం కలిగిన ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ మళ్లీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయడం సంచలనాన్ని రేకెత్తించింది. సామాజిక ఉద్యమ నేపథ్యం సేవా దృక్పథం కలిగి ప్రజల్లో పేద మధ్యతరగతి కుటుంబాల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్న ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ ఓట్లను ఏమైనా చీల్చుతాడేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవం కూడా తనకు కలిసి వస్తుందేమోనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అలాగే గెలుపు దిశగా ఏమైనా అడుగులు వేస్తాడా అని అనుమానాలు కలుగుతున్నాయి.
