ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికై పెద్దేముల్ లోఇసుక రీచ్ లను పరిశీలించిన అధికారుల జాయింట్ యాక్షన్ కమిటీ

జిల్లా వార్తలు : సంక్షేమం

kura Yadaiah |October 21,2025,

హిందు 9న్యూస్ పెద్దేముల్:

Indiramma houses| వికారాబాద్ జిల్లా కలెక్టర్ సూచన మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికై పెద్దేముల్ మండలంలోని రేగొండి కొండాపూర్ ఇసుక రీచ్ లను మంగళవారం రోజు అధికారుల నేతృత్వంలోని జాయింట్ యాక్షన్ కమిటీ పరిశీలించింది.

పెద్దేముల్: indiramma houses| వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ సూచన మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కావలసిన ఇసుక రీచ్ లను అధికారుల నేతృత్వంలోని జాయింట్ యాక్షన్ కమిటీ పరిశీలించిన చేశారు. మంగళవారం రోజు జాయింట్ యాక్షన్ కమిటీలోని అధికార బృందం సభ్యులు , బి సత్యనారాయణ మైండ్స్ క్రియాలజీ, డి శిరీష డి ఈ నీటిపారుదల శాఖ, జి శ్యాంప్రసాద్ ఈఈ దిశ, బి వెంకటేశ్వర ప్రసాద్ తాసిల్దార్ పెద్దముల్, రతన్ సింగ్ ఎంపీడీవో పంచాయతీ రాజ్, మహేష్ సర్వే రెవెన్యూ శాఖ, అహెక్రాజ్ కుమార్ ఏ ఈ రాస్ ఇంట్రా మిషన్ బ్యాక్ సెంట్రింగ్ ప్లేంగ్, రిచర్డ్ సైమన్ ఆర్ ఐ పెద్దెముల్, సయ్యద్ వాజిదుద్దీన్ ఏఈ భూగర్భ జలమనరులు, ఎం నాగలక్ష్మి ఏడి మైన్స్, శ్రీనివాస్ పంచాయతీ సెక్రెటరీ రేగొండి లతో కలిసి రేగొండి కొండాపూర్ కాగ్న నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఇసుక రీచ్ లను అలాగే అక్కడినుండి రవాణా చేసే రహదారులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు స్థానిక తాసిల్దార్ వెంకటేష్ ప్రసాద్ తెలిపారు.ఇసుక రీచ్ లను సందర్శించి పరిశీలించిన నేపథ్యంలో ప్రస్తుతం నదిలో నీళ్ల ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఇసుక తీసుకురావడం కష్టతరంగా ఉందని చెప్పారు. అలాగే అక్కడి నుండి ట్రాక్టర్గాలతో గాని ఇతర వాహనాలలో ఇసుక తరలించాలంటే కూడా రహదారి మొత్తం బురదమయంగా గుంతల్లో నీళ్లు ఉండటం వల్ల వాహనాలు కూడా ఇసుక తరలించే అవకాశం లేదని తెలిపారు. అడల్ పూర్ వైపు నుండైనా తరలించాలంటే అక్కడి రైతులు పొలాలకు పంటలకు నష్టం జరుగుతుందని వారు కూడా నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నారు.తర్వాత కొండాపూర్ ఇసుక రీచ్ లను పరిశీలించిన కూడా అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉందని అక్కడి నుండి కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక తరలింపు ప్రస్తుతం సాధ్యం కాదని పేర్కొన్నారు. అయితే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తాత్కాలికంగా ఎక్కడి నుండి తరలించాలనే అంశం ఆలోచిస్తామని, పరిశీలించిన విషయాన్ని జిల్లా కలెక్టర్ కు నివేదిస్తామని తహసిల్దార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ ట్రాక్టర్ డ్రైవర్లు రైతులు రేగొండి పంచాయతీ సిబ్బంది ఇతరులు తదితరులు ఉన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *