వికారాబాద్ జిల్లాలో రేపు బీసీ బంద్ ను విజయవంతం చేయండి, ప్రజలకు పిలుపునిచ్చిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై మహేందర్,

kura yadaiah October 17,2025,

హిందు 9న్యూస్ డెస్క్ :

Bc band| రేపు బీసీ బంద్ ను వికారాబాద్ జిల్లాలో ప్రజలు ప్రజాస్వామికవాదులు రాజకీయపక్షాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు బీసీ బందును విజయవంతం చేయాలని వికారాబాద్ జిల్లా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యదర్శి వై మహేందర్ పిలుపునిచ్చారు….
BC | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం కామారెడ్డి లో బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ వికారాబాద్ జిల్లా కార్యదర్శి వై మహేందర్ డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ తొమ్మిదవ షెడ్యూల్లో ఈ రిజర్వేషన్లను చేర్చి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అందే విధంగా చూడాలని 18 తారీకు రోజున బీసీ జేఏసీ ఇచ్చిన బందుకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని ఆయన తెలిపారు. సామాజిక న్యాయం లో భాగంగా రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు కుల సంఘాలు పెద్ద ఎత్తున బీసీలు ఈ బందులో పాల్గొని విజయవంతం చేయాలని మహేందర్ పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మరియు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సమన్వయంతో రిజర్వేషన్ల అమలు కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజా ఉద్యమాలతోనే ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందని న్యాయమైన డిమాండ్ కోసం అన్ని పక్షాలు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *