రేగొండి లో ఘనంగా మైసమ్మ వార్షికోత్సవం, శాఖమోళ్ల, శివకుమార్ ఆధ్వర్యంలో అన్నదానం,

kura yadaiah |October 19,2025,

హిందు 9న్యూస్ డెస్క్:

Temple|వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రేగొండి లో శాకమోళ్ళ శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా మైసమ్మ వార్షికోత్సవం నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

పెద్దేముల్: Temple| వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రేగొండి లో మైసమ్మ వార్షికోత్సవ ఉత్సవాలు శాకమొళ్ళ శివ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శివకుమార్ ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేశారు.

-అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత ధారా సింగ్,లొంక నర్సింలు,

అన్నదాన కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలతో పాటు “Congress party “టిపిసిసి ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ తాండూర్ (A ,block) మాజీ అధ్యక్షుడు లొంక నర్సింలు ఇతర నాయకులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించారు. వార్షికోత్సవానికి హాజరైన టిపిసిసి ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దైవభక్తిని దైవచింతనను అలవర్చుకోవాలని దైవచింతన అలవర్చుకోవడం వల్ల మనుషులకు ప్రశాంత లభిస్తుందని గ్రామాలు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాయని తెలిపారు. గ్రామాలలో దైవభక్తి ఉంటే పాడిపంటలు పసుపు పోషణ ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని ప్రజలు ఇలాంటి ఆలోచనలు చేసి గ్రామాలలో మంచి నడవడికను మంచి సాంప్రదాయాన్ని తీసుకురావచ్చు అని పేర్కొన్నారు. గుడులు గొపురాలు దేవుళ్ళను కొలవడం వల్ల మానసిక ఆందోళనలు దూరమై మనుషులను మానవ విలువల పెంపు , మానవ సంబంధాలను మంచితనాన్ని పెంచుతాయని అన్నారు. ఇలాంటి ఉత్సవాలు ప్రజలందరూ కలుసుకోవడానికి మంచి సాంప్రదాయ వేదిక లు గా ఉంటాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాన్ని రేగొండి లో శివకుమార్ నిర్వహించడం మంచి సాంప్రదాయంగా ధారసింగ్ అభివర్ణించి శివకుమార్ కుటుంబ సభ్యులను అభినందించారు.

కార్యక్రమములో శివ కుమార్ తల్లి దండ్రులు పాపయ్య మహాదేవి ఇతర అవానితులు కోనేరు మానేయ్య పి,బంద్యయ్య మాజీ సర్పంచ్ చైతన్య నగర్ అంజిలయ్య డీలర్ లాలయ్య కొండాపూర్ మాజీ సర్పంచ్ కొమిరే చంద్రయ్య జంగాల లింగేష కూర మల్లేశం,కొలుకొంది వెంకటయ్య,కూరపాటి బీమయ్య డి, అశోక్ కుమార్, టి, వెంకటయ్య నీరటి రాములు, ఇతర ప్రముఖులు గ్రామస్తులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *