తాండూర్ లో బిసి బంద్ విజయవంతం, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన జేఏసీ నేతలు,

kura Yadaiah |October 18,2025,

హిందు 9న్యూస్ తాండూర్ ప్రతినిధి

BC reservation | 18 తారీకు శనివారం రోజు బీసీ రిజర్వేషన్ల అమలు, రాజ్యాంగంలోని 9 షెడ్యూల్లో చర్చి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇచ్చిన బంద్ పిలుపు తాండూర్లో విజయవంతమైందని జేఏసీ నేతలు కందుకూరి రాజకుమారి ఈడివి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

BC reservation|బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు రాజ్యాంగంలోని 9 షెడ్యూల్లో చర్చి చట్టబద్ధత కల్పించి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ బిసి జేఏసీ నేత కందుకూరి రాజ్ కుమార్ ఈడికి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో జరిగిన బందు విజయవంతం అయింది. ఈ బంద్ లో తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలిచారు.అనుకున్నట్లుగానే ఈ బంద్ కు టిఆర్ఎస్ బిజెపి జన సమితి అధికార కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం ట్రేడ్ యూనియన్ వివిధ సంస్థల అసోసియేషన్ పాల్గొని విజయవంతం చేశాయి. ఉదయం నుండి వ్యాపార సముదాయాలు విద్యాసంస్థలు ఆటో యూనియన్ మార్కెట్ అసోసియేషన్లు పూర్తిగా బందుకు సహకరించాయి అని జెఎసి నేత కందుకూరి రాజ్ కుమార్ వీడికి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అంబేద్కర్ చౌ క్ నుండి ప్రారంభమైన బీసీ ఐక్యత బైక్ ర్యాలీ పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ప్రజల్లో బందుకు సహకరించే విధంగా విస్తృత ప్రచారం కల్పించారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష వామపక్ష పార్టీలతో సహా బీసీ సంఘాలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు అయ్యేదాకా పోరాటం కొనసాగిస్తామని ప్రముఖులు పేర్కొన్నారు. కార్యక్రమానికి రాజకీయ పార్టీలు బీసీ సంఘాల ప్రతినిధులు కుల సంఘాలు మహిళా ప్రతినిధులు విద్యార్థి నాయకులు యువజన సంఘాలు ట్రేడ్ యూనియన్లు వ్యాపార సంస్థలు సహకరించి ఐక్యతను చాటాయని రాజ్ కుమార్ పేర్కొన్నారు. బంద్ కు సహకరించిన ప్రతి సంస్థకు రాజకీయ పార్టీలకు బీసీ నేతలకు కార్మిక వ్యాపార సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *