జాతీయ వార్తలు,
హిందు 9 న్యూస్: 19/3/2026,

_______ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ,
ఉగాది పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు….
ఢిల్లీ :ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ఉగాది పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఉగాది పండుగ పునరుత్తేజాన్ని వెంట తీసుకువస్తుందని మోదీ పేర్కొన్నారు. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అంటూ ప్రధాని తెలుగులో ట్వీట్ చేశారు. పండుగకు సంబంధించిన ఓ కోట్ ను తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేశారు. ఈ కొత్త సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో అమితమైన సంతోషాన్ని, శ్రేయస్సును నింపాలని కోరుకుంటున్నట్లు మోదీ చెప్పారు. ప్రజల జీవితాల్లో అన్ని అంశాల్లోనూ కొత్త ఏడాది కొత్త సంతోషాలను తీసుకువస్తుందని ఆశిస్తున్నట్లు వివరించారు.
