Pro Jaishankar|ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ఆలోచనలను భవిష్యత్ తరాలకు అందించాలి, తెలంగాణ జన సమితి తాండూర్ ఇన్చార్జి సోమశేఖర్,

Pro jayashankar | ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచన ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించాలి, తాండూర్ తెలంగాణ జన సమితి నేత సోమశేఖర్  అన్నారు……

Pro jayashankar |తాండూర్ :బుధవారం రోజు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు తెలంగాణ జన సమితి, విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకంలోని నడిచిందని ఆయన లేకుంటే తెలంగాణ ఉద్యమం ఉండేది కాదని తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతకై గల్లి నుండి ఢిల్లీ వరకు భావజాల వ్యాప్తి ని విస్తరింపచేసిన నేత ప్రొఫెసర్ జయశంకర్ అని తాండూర్ తెలంగాణ జన సమితి ఇంచార్జ్ సోమశేఖర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచన ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆయన కలలు కన్న ప్రజాస్వామిక తెలంగాణ సాధనకై ప్రభుత్వాలు కృషి చేయాలని లేదంటే తెలంగాణ లో మరో ప్రజాస్వామిక పోరాటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

రాజం, విజయ్ కుమార్ తెలంగాణ విద్యావంతుల వేదిక,

ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు నేటి తరానికి అన్నివార్యమయ్యాయని ప్రభుత్వం జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించాలని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వం చేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం కూడా ప్రజాహాగ్రహానికి గురికాక తప్పదని ప్రజాస్వామిక హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజాం విజయ్ కుమార్  అన్నారు.

పర్యాద రామకృష్ణ విద్యావంతుల వేదిక నాయకులు,

ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తివంతమైన జీవిత చరిత్రను విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉందని ప్రస్తుతం తెలంగాణలో ఉన్న యువత కూడా ప్రొఫెసర్ జయశంకర్ జీవిత చరిత్రను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని విద్యావంతుల వేదిక నాయకులు పర్యాద రామకృష్ణ అన్నారు. ఆయన ఆదర్శవంతమైన జీవన విధానం నేటి తరం నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

భద్రేశ్వర్ బిజెపి నాయకులు,

స్వరాష్ట్ర సాధన ఉద్యమ నిర్మాణం చేసిన పోరాట దిక్సూచి జయశంకర్ అని సబ్బండ వర్గాల అభివృద్ధికి పాలకులు కృషి చేయాలని బిజెపి నాయకులు భద్రేశ్వర్ అన్నారు.

శ్రీనివాస్ సిఐటియు నాయకులు,

ఎన్ని ప్రభుత్వాలు మారిన స్వరాష్ట్రం సహకారమైన తెలంగాణలో పేదల బతుకులు మారడం లేదని జయశంకర్ స్ఫూర్తితో పేద ప్రజలకు ప్రభుత్వ ఫలాలు దక్కాలని సామాజిక న్యాయం అందాలని ఆ దిశగా పోరాటం చేస్తామని సిఐటియు నాయకులు శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ యువజనుల సర్వీస్ అధికారి హనుమంతరావు టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ చారి టిపిఎల్ఎఫ్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి సి విజయ్ కుమార్ జిలకర రవీందర్ నరోద్దీన్ సురేష్ గౌరీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *