ముఖ్యాంశాలు,
Kura Yadaiah /February 25,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :


తెలంగాణ ఉద్యమ కారుల సమస్య లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ఉద్యమకారులుగా స్వాగతిస్తున్నామని ప్రొఫెసర్ రాజు తెలిపారు….
హిందు 9 న్యూస్ (తాండూర్ 25):తెలంగాణ ఉద్యమ కారుల పట్ల హై కోర్టు తీర్పు ను స్వాగతిస్తున్నామని ప్రొఫెసర్ రాజు అన్నారు. బుధవారం ఈరోజు తాండూర్ నియోజకవర్గంలోని తెలంగాణ ఉద్యమ ముఖ్య కార్యకర్తలతో సమావేశమై ప్రొఫెసర్ రాజు ఈ సందర్భంగా అన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని స్వరాష్ట్రం కోసం త్యాగమైన ఉద్యమకారులను ప్రభుత్వం గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని ఆయన అన్నారు.
అలాగే ఇటి వల్ల హైకోర్టు తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై స్పందించి తీర్పునిచ్చిందని ఆ తీర్పును తెలంగాణ ఉద్యమకారులుగా సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి అర్హులైన ఉద్యమకారులకు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పినట్టి సంక్షేమ పథకాలతో పాటు గృహ వసతి తో పాటు తదితర సమస్యలను ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమ కారుల త్యాగాల వల్లనే ఈరోజు తెలంగాణ సాధించుకున్నామని అలాంటి ఉద్యమకారులను స్వరాష్ట్ర ఉద్యమకారులుగా పౌరులుగా గుర్తించాల్సిన అవసరం వారి త్యాగాలకు ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షులు ఫిరోజ్ ఖాన్ లెక్చరర్ ఫోరం అధ్యాపకులు జైపాల్ మహేందర్ బసంత్ విద్యావేత్త పర్యాద రామకృష్ణ , చెన్నకేశవులు భద్రేశ్వర్ జిలాని వాజీ ప్రకాష్ గౌడ్ లక్ష్మణ్ సంజయ్ గౌడ్ కాసిం పాషా ఇందూర్ శ్రీనివాస్ వెంకటయ్య రాములు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
