ప్రకటన
K Yadaiah |October 1,2025,
సాయుధ పోరాట విరమణ విషయంలో అభయ్ చేసిన ప్రకటనపై తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ చేసిన ప్రకటనకు కౌంటర్ గా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ మరో లేఖాస్త్రం సంధించారు….

హిందు 9న్యూస్ ప్రత్యేక ప్రతినిధి:
Maoist leader letter fights|గత కొన్ని రోజులుగా మావోయిస్టు పార్టీ నాయకత్వం మధ్య లేఖల యుద్ధం కొనసాగుతూ వస్తున్నది. గతంలో తాత్కాలికంగా సాయుధ పోరాటాన్ని విరమణ చేస్తూ అనే ప్రకటనతో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అధికార ప్రతినిధి అలియాస్ అభయ్ మల్లోజుల వేణుగోపాల్ లేఖ రాయడం అందరికీ తెలిసిన అంశమే అయితే. దానికి ప్రతీక తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఖండన ఒక లేఖ విడుదల కావడం అందరికీ తెలిసిన అంశమే ,ఇది ఇప్పటివరకు జరిగిన లేఖల అంశమైతే మళ్లీ ఇప్పుడు జగన్ చేసిన ప్రకటనకు కౌంటర్ గా అభయ్ పేరుతో మరో లేఖ విడుదల చేయడం ప్రజల్లో చర్చనీయాంశమయ్యింది. అయితే జగన్ దీర్ఘకాల ప్రజాయుద్ధ పంధాకే జగన్ కట్టుబడి ఉండడం పై నాకు ఎలాంటి అభ్యంతరంగాని భేద అభిప్రాయాలు కానీ లేవని అభయ్ జగన్ ప్రకటనలోని అంశాలకు స్పష్టంగా అంశాలవారిగా కౌంటర్ ఇచ్చారు. ఈనెల 22వ తేదీ ఈ ప్రకటన విడుదల చేసినట్టు తెలుస్తున్నది. జగన్ ప్రకటనలోని ముఖ్యమైన విషయాలపై మాత్రమే నా అభిప్రాయాలను మరో మారు ప్రజల ముందు ఉంచక తప్పడం లేదు అని అందుకే నేను ఎంతో వివరిస్తున్నానంటూ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి పేరుతో జగన్ కు అభయ్ మరో మారు పత్రికా ప్రకటన ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.
నా ప్రకటనలో నేను చాలా స్పష్టంగానే మా పార్టీ ప్రధాన కార్యదర్శి అమరుడు కామ్రేడ్ నంబాల కేశవరావు ప్రారంభించిన శాంతి చర్చలను నేను, నాతో పాటు కొంతమంది కామ్రేడ్స్ కొనసాగించదల్చుకున్నామని తెలిపాను. వారిలో కామ్రేడ్ రూపేష్ ఒకరు. కాబట్టి ఇది పూర్తి పార్టీ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయము కాదని జగన్ విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తొందరపాటుతో ఇచ్చిన ఈ ప్రకటన పార్టీ నిర్మాణ పద్ధతులకు కూడా భిన్నమైనది. ఆయన తన రాష్ట్రానికి పరిమితమై నా ప్రకటనపై తన/ తమ అభిప్రాయాలను ఇవ్వాల్సి ఉంటుందని ఆయనకు తెలియనిదేమీ కాదు అని అభయ్ పేర్కొన్నారు.
నేను ఆ విషయాన్ని నా ప్రకటనలో కోరాను కూడా. ఇక్కడే ఆయనకు మరో విషయాన్ని నేను స్పష్టం చేయదలచుకున్నాను అంటూ తెలిపారు. నవంబర్ 2024 లో జి ఎస్ సమక్షంలోనే కొంతమంది సీసీఎంల శాంతి చర్చల విషయాన్ని చర్చించి ఆయుధాలు వదలకుండా ప్రభుత్వం చర్చలకు సిద్ధం లేదని మనం ఇక శాంతి చర్చల గురించి ఆలోచించకూడదని కూడా అభిప్రాయపడినాం తాజా లేఖ ద్వారా పేర్కొన్నారు. కానీ దీనికి భిన్నంగా మీ అందుబాటులోని సీసీఎంలు శాంతి చర్చలకు మేం సిద్ధం అంటూ మార్చ్ 2025లో తెలంగాణ శాంతి చర్చల మిత్రులకు అభిప్రాయం పంపారు. ప్రభుత్వం పదేపదే ఆయుధాలను వదలడం గురించి చెబుతున్న విషయంలో అందుబాటులో ఉన్న కొద్ది మందైనా స్పష్టమైన నిర్ణయం తీసుకొని దాన్ని స్పష్టం చేస్తూ ఆ ప్రకటన పంపి ఉండాల్సింది అని అభిప్రాయపడ్డారు. అలా చేయకపోవడంతో ఆ ప్రకటనని అనుసరిస్తూ కామ్రేడ్ బసవరాజు రూపేష్ లు పరస్పరం చర్చించుకుని శాంతి చర్చలపై అనివార్యంగా ప్రకటనలు విడుదల చేశారు. ఇవన్నీ నవంబర్ 2024 అవగాహనకు భిన్నమైనవనే విషయం కామ్రేడ్ జగన్ ముందు తన బాధ్యుల నుండి తెలుసుకోవాలి అని సూచించారు. అయినప్పటికీ పరిస్థితి తీవ్రతలో వస్తున్న పరిణామాల నేపథ్యంలో కామ్రేడ్ చొరవ చేస్తున్నారనే యావత్తు పార్టీ భావించింది అని పేర్కొన్నారు. వాటి కొనసాగింపుగానే ప్రస్తుతం నా ప్రకటన అనేది ఆయన అర్థం చేసుకోవాలి.సీసీ లో జరుగుతున్న విషయాలపై ఆయనకు స్పష్టత లేనప్పుడు ముందుగా వాటిని తెలుసుకొని అవసరం అనుకుంటే వాటిపై తన తమ వైఖరిని సీసీకి పంపుకోవచ్చు అంటూ జగన్ ప్రకటన ద్వారా సూచించారు. ఆయనకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఏది చేయకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం విచారకరం అంటూ అభయ్ తన విచారాన్ని వ్యక్తం చేశారు.
రెండో విషయానికి వస్తే పార్టీ అనుమతితో నేను సరెండర్ కావచ్చు అని ఆయన సలహా ఇచ్చాడు. ఆయన నా ప్రకటనలోని విషయాలపై కానీ, నేను ప్రజలకు చేసిన విజ్ఞప్తిపై కానీ నామమాత్రంగనైనా రాజకీయంగా స్పందించకుండా నా సరెండర్ గురించి మాట్లాడడం ఆయన రాజకీయ అపరి పక్వతను చాటుతుందని విమర్శించారు. నిజానికి ఈ రెండు ప్రకటనల కన్నా పార్టీలో అంతర్గత సర్కులేషన్ కోసం తెలుగులో నేను విడుదల చేసిన 22 పేజీల కేడర్ విజ్ఞప్తిని ఆయన చదివి దానిపై తన అమూల్యమైన అభిప్రాయాన్ని తెలిపి ఉంటే అది మన సీసీ కి పార్టీకి చాలా ఉపయోగపడేది అంటూ చెప్పుకొచ్చారు. నేను ఆ 22 పేజీల విజ్ఞప్తిలో రాసినవన్నీ మన పీడిత ఆగస్టు 2024 లో విడుదల చేసిన సర్కులర్ లోనివేనని ఆయనకు ముందుగా స్పష్టం చేస్తున్నాను. గత ఏడాది కాలంగా మనం ఆ సర్కులర్ ను ఇక్కడ అమలు చేయలేకపోయాం. నిజానికి వాటిని మనం అమలు చేస్తూ భారత విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనం తాత్కాలిక సాయిధ పోరాట విరమణ చేయడం అనివార్యమని గత ఏడాది ఆచరణ మరింత స్పష్టంగా మనము హెచ్చరిస్తున్నదని పేర్కొన్నారు. దీనిని నా వ్యక్తిగత విషయంగా మీరు మార్చడం మీ అమాయకత్వాన్ని ప్రదర్శించుకోవడమే ఘాటుగా ఆయన స్పందించారు.
మీ అందుబాటులోని సీసీఎంలు కానీ అమరుడు కామ్రేడ్ బసవరాజు కానీ మన పార్టీ జార్ఖండ్ కామ్రేడ్ నుండి విడుదలైన కాల్పుల విరమణ ప్రకటన కానీ మన పార్టీని కాపాడుకోవడానికి తప్ప సరెండర్ల కోసం కాదని తెలిపారు. వారు పార్టీని కాపాడుకోవాలని ప్రభుత్వంతో శాంతి చర్చల కోసం చొరవ చేశారు అని అభయ్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. కామ్రేడ్ బసవరాజు పార్టీ ఆయుధాలు వదలడానికి కూడా సిద్ధపడే విషయం ఆలోచించడం కేవలం ఆయన ఒక్కడి ప్రాణాలను కాపాడుకోవడం కోసం కానే కాదు లేఖలో స్పష్టం చేశారు. సరే ఆయన అలాంటి ప్రతిపాదన చేయడం తప్పని ఈ రోజు మీలాంటి కొంతమంది కామ్రేడ్ సమీక్షించడం అది మీ వ్యక్తిగతమైనదే అవుతుందే అన్నారు. భవిష్యత్తులో యావత్తు పార్టీ దాని మంచి చెడులను తేలుస్తుంది. మీరు కూడా తెలంగాణలో కాల్పుల విరమణ చేసింది వర్తమాన పరిస్థితులలో మన పార్టీని కాపాడుకోవడానికి కాదంటారా? అయితే ఇక్కడ తేడాల్లా ప్రభుత్వ వైఖరిని పరిగణలోకి తీసుకోకుండా శాంతి చర్చలకు సిద్ధం కావడంలోనే మన వైఫల్యం వుంది అన్నారు. దీనిని మీరు ఇప్పటికైనా గుర్తించండి నేను మెయిల్ ఐడి ఇవ్వడం పై కూడా కామ్రేడ్ జగన్ నా ప్రకటనను సవ్యంగా అర్థం చేసుకోలేదు. మనం అవకాశం ఉన్న మేరకు పరస్పరం కలుసుకోవడం లేదా పార్టీ చానల్లో ఉత్తరాలు ప్రత్యుత్తరాలు జరుపుకోవడం అనేది నా ప్రకటనలో మొదటి ప్రాధాన్యత విషయం. అలా చేయలేకపోతున్న విధి లేని పరిస్థితులలో మెయిల్ ఐడి ఇవ్వక తప్పలేదు అంటూ అభయ్ పేర్కొన్నారు. మన సీసీ ఎంత సమన్వయ రాహిత్యాన్ని ఎంత కాలంగా ఎదుర్కొంటుందో కామ్రేడ్ జగన్ కు నేను చెప్పాల్సిన పని లేదని పేర్కొన్నారు.
-దీర్ఘకాల పంధా మన దేశ కాల పరిస్థితులకు తగనిది..
ఐడి ఇవ్వడం అనేది ఒక ప్రత్యాన్మాయమైన మార్గం మాత్రమే. దాని పరిమితులు మనందరికీ తెలిసినవే!
నేను మరోసారి కామ్రేడ్ జగన్ కు చేసే విజ్ఞప్తి ఏమిటంటే ప్రాంతాలవారీగా రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకునే దీర్ఘకాల ప్రజాయుద్ధ పంధా ఇకపై మన దేశ కాల పరిస్థితులకు తగనిది అని తెలంగాణ సహా దేశంలోని అనేక విప్లవోద్యమ ప్రాంతాలు నిరూపించాయి అంటూ తెలిపారు. ఈ విషయాన్ని మీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి సహా మిమ్మలను గైడ్ చేసే సీసీఎంలు 2020 నాటికి గుర్తించిన విషయం మీరు వారి నుండి తెలుసుకోండి. గత రెండు దశాబ్దాలకు పైగా మనం తెలంగాణ భూభాగంలోకి వెళ్లి విప్లవోద్యమ కృషి చేయలేకపోతున్నామనేది ప్రతిసారి రక్త తర్పణం చేసి డీకే కు వెనుతిరుగుతున్నామనేది మీరు నేను మనం ఎవరమో కాదనలేని వాస్తవమని స్పష్టం చేశారు. దీనిని ఇప్పటికైనా గుర్తించండి. మీరు తెలంగాణ ప్రభుత్వంతో ఆరు మాసాల కాల్పుల విరమణకు విజ్ఞప్తి చేశారు. త్వరలో ఆ గడువు పూర్తి కాబోతుంది. ఆ తర్వాత.. ఆ తర్వాత.. తర్వాత ఇలా ఎంతకాలం సాగుతుందో మీరు ఆలోచించకుండా అంటూ పేర్కొన్నారు
కాల్పుల విరమణ కాలంలో మన విప్లవ కార్యచరణ పట్ల పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉంటారనేది మీరు కాదన లేరు. కాబట్టి అనవసర నష్టాలకు తావివ్వకుండా విజ్ఞతతో వ్యవహరించడమే విప్లవకారులు చేయాల్సిన పని అని అన్నారు.
ఇందులో మన సీసీ ఘొరంగా విఫలమైందని మన 2024 సర్కులర్ చెబుతున్నది. దానిని అర్థం చేసుకోగలరు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మారుదాం. మనం విశాల ప్రజల మధ్యకు వెళ్లి ప్రజా పునాదిని పటిష్టపరచుకుందాం అనేది నా విజ్ఞప్తి ఆపై మీ ఇష్టం అంటూ అభయ్ మరో మారు తన లేక ద్వారా తెలిపారు.
ఈ సందర్భంగా నేను ముందుగా నా ప్రకటనపై మేధావుల విమర్శకుల ప్రజాసామిక వాదుల విప్లవ శ్రేయోభిలాషుల అభిప్రాయాలను అంచనాలను ప్రజల వరకు చేర్చడానికి అహూరాత్రులు పాటుపడిన పాత్రికేయులు ఔస్తాయిక పాత్రికలు యూట్యూబర్లు సహా సామాజిక మాధ్యమాల మిత్రులందరికీ రెడ్ సెల్యూట్ తెలుపుకుంటున్నాను. నా ప్రకటనపై అనేకమంది అనేక రకాలుగా స్పందించడం హర్షనీయం. ముఖ్యంగా మా పార్టీలో పనిచేసి ప్రస్తుతం బయట జీవిస్తున్న వారు అనేక రకాలుగా నా ప్రకటనను వారి వారి అవగాహనాల ప్రకారం విశ్లేషిస్తూ తమ అభిప్రాయాలను ప్రజలతో పంచుకోవడాన్ని నేను స్వాగతిస్తున్నాను.
అయితే మా పార్టీ తొలి నుండి రహస్య పార్టీ అనేక దశాబ్దాలుగా ఒక నిషేధిత పార్టీ. మా పార్టీలోని అంతర్గత వ్యవహారాలపై బయటి వారు సాధికారికంగా స్పందించలేరని విషయం విజ్ఞులకి తెలిసిందే అంటూ అన్నారు. కాబట్టి నేను నా ప్రకటనపై వేసిన తేదీ ఫోటో ఇచ్చిన మెయిల్ ఐడి పై కొన్ని సందేహాలు తలెత్తడంతో పాటు కొందరు నేను పార్టీ నుండి కొద్దికాలం క్రితమే దూరమైపోయి పోలీసుల సంబంధాలలో ఉన్నాననే వరకు మాట్లాడుతున్నారు. నేను పార్టీ నుండి దూరమైతే కామ్రేడ్ జగన్ మొదట అదే విషయాన్ని తన ప్రకటనలో ప్రస్తావించేవాడనేది బొడ్డూడని శిశువు సైతం చెబుతుంది పేర్కొన్నారు.
-దేవ్ జి వార్తా మీడియా సృష్టే.!
కామ్రేడ్ దేవ్ జీ పార్టీ జనరల్ సెక్రెటరీగా ఎన్నికైనడని బూటకపు విషయాన్ని సృష్టించిన మీడియా మా రహస్య పార్టీ విషయాల సేకరణకు కావాలని అనేక తప్పుడు విషయాలను ముందుకు తెస్తుంది అని మీడియా పై మండిపడ్డారు. వాటి అన్నింటిపై నేను ఇక్కడ ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదు కానీ కొన్ని విషయాలపై మాత్రం స్పష్టత ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.
నేను 15 ఆగస్టు నాడు తయారు చేసిన ప్రకటనపై అంచలంచలుగా పార్టీ శ్రేణుల మధ్య చర్చ జరిపి చివరకు సెప్టెంబర్ 12 నాడు ఆ చర్చలు ముగిశాక అందులో ఎలాంటి మార్పులు చేయకుండానే విడుదల చేయడంతో డేటు విషయం కొంతమందిలో అనుమానాలను రేకెత్తించింది అంటూ పేర్కొన్నారు. అంతకుమించి డేట్ కు ఎలాంటి ప్రాధాన్యత లేదు దురదృష్టవశతు ఈ చర్చలలో సమన్వయ సమస్యతో కామ్రేడ్ జగన్ కానీ మరి కొంతమంది ముఖ్యమైన కామ్రేడ్స్ పాల్గొనలేకపోయారు అంటూ ఈ లెటర్ ద్వారా ఆయన గుర్తు చేశారు. ప్రకటన పైన ఫోటో విషయానికి వస్తే మా పార్టీలో సీసీ అధికార ప్రతినిధిని నేనే అయినప్పటికీ మా సీసీ కామ్రేడ్స్ ఎవరైనా అవై పేరుతో అత్యవసర సమయాలలో పార్టీ ప్రకటన విడుదల చేయవచ్చని అవగాహన ఉంది . ఇది మా పార్టీలోని అన్ని కమిటీలకు వర్తిస్తుంది. కాబట్టి నేను ఈసారి అత్యంత ముఖ్యమైన విషయంపై నా ఫోటోతో ప్రకటన విడుదల చేయడం శ్రేయస్కారమని భావించాను అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అభయ్. ప్రకటనలోనే సాయుధ పోరాట విరమణ కొంతమంది అభిప్రాయం అని రాసినప్పటికీ ఇంకే పొరపాటు సందేశం ప్రజలలోకి వెళ్లకుండా ఉండడానికి నా ఫోటో వేశాను అన్నాడు అభయ్. దీనినైనా కామ్రేడ్ జగన్ అర్థం చేసుకుంటే ఆ ప్రకటన మూలాలు అర్థమయ్యేవి అంటూ పేర్కొన్నారు.
నేను ప్రజలకు విడుదల చేసిన విజ్ఞప్తి విషయంలో కూడా కొంతమంది తమకు తోచింది మాట్లాడుతున్నారు. నేను అందులో వ్యక్తం చేసిన విషయాలన్నీ మా పొలిట్ బ్యూరో విడుదల చేసిన సర్కులర్ లోని విషయాల సంగ్రహ పాఠమే. నేను సాయిధ పోరాట విరమణ ప్రకటన విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇంతకాలం సేవ చేసిన ప్రజలకు బాధ్యతగా అపరాధ భావనతో క్షమాపణలు చెప్తున్నాను అంటూ అభయ్ చెప్పుకొచ్చారు. చివరగా నా విజ్ఞప్తి ఏమంటే ఏదైనా ఒక విషయంపై మాట్లాడదలచుకున్న వాళ్లు ఎవరైనాప్పటికీ వారు వ్యక్తిగత దూషణలకు దిగడం వారి సంస్కారహీనతను రాజకీయ దివాలా కోరుతనాన్నే తెలుపుతుంది. అలాంటి వారితో ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం చేకూరదు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా స్పందించాలని మనవి.
ముగింపులో కామ్రేడ్ జగన్ నా విజ్ఞప్తి ఏమంటే కామ్రేడ్ జగన్ 1977 ఆగస్టులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ చేసిన తీర్మానాన్ని దయచేసి క్షుణ్ణంగా చదువు అంటూ జగన్ సూచించారు. సరే దానిని 18 ఏళ్ల తర్వాత సిసి ఆ తీర్మానం అవసరం ఆనాడు చేయాల్సిన అవసరం లేకుండేనని సమీక్షించినప్పటికీ నేటి యువతరం ఆనాటి పరిస్థితులను తెలుసుకోవడానికి అది ఎంతగానో తోడ్పడుతుంది. అందులో ఎంతో అనుభవంతో ఇలా చెప్పారు. గత పది ఏళ్ల సాయిధ పోరాటంలో ప్రతిష్టంభన ఏర్పడింది.

అది దెబ్బ తిన్నది. చాలా కష్టం మీద అక్కడొకటి ఇక్కడొకటి యాక్షన్ చేయడం తద్వారా శత్రువుకు కలిగించిన నష్టం కంటే మనం ఎక్కువ నష్టానికి గురవడం జరుగుతుంది. ప్రజా పునాది ప్రాముఖ్యతను మన కేడర్ గుర్తించకపోవడం కూడా ముఖ్య కారణం. ఆ సంబంధాలే ఉంటే ఒక్కసారి దెబ్బతిన్న ప్రాంతంలో అతి దీర్ఘకాలం సంబంధాలు నెలకొనకపోవడం జరగదు. ఈ నేపథ్యంలో మనం తెలంగాణ విప్లవోద్యమాన్ని మారిన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ పునరాభివృద్ధి కోసం పాటుపడాలని కోరుతున్నాను.
