ప్రగతి వార్తలు,
హిందు 9 న్యూస్ (17/3/2026,):


పెద్దేముల్ లోని జనగాం మారేపల్లి ఘాజీపూర్ కందనెల్లి తాండ పంచాయతీలలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక సర్పంచులను కాంట్రాక్టర్లను వికారాబాద్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వణ అధికారి సుధీర్ బాబు ఆదేశించారు…..
పెద్దేముల్: మండల పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాన అధికారి సుదీర్ కుమార్ తెలిపారు.
మంగళవారం రోజు వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం లోని జనగామ మారేపల్లి ఘాజీపూర్ కందనెల్లి తండా గ్రామపంచాయతీలో వివిధ అభివృద్ధి కింద చేపట్టిన డ్వాక్రా భవనం స్కూల్ కాంపౌండ్ వాల్, సిసి రోడ్లు తదితర పనుల పురోగతిపై డిపిఆర్ నాగభూషణం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రతన్ సింగ్ తో కలిసి తనిఖీ చేశారు.


ప్రభుత్వం ద్వారా మంజూరైన వివిధ అభివృద్ధి పనులు పంచాయతీలలో త్వరగా చేసి పూర్తి చేయాలని తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక సర్పంచులను కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు.

అలాగే ఘాజీపూర్ గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు సిసి రోడ్డు పనులను ప్రారంభం చేసుకోవాలని సర్పంచ్ ఉప సర్పంచ్ సభ్యులను చెప్పారు.

కందనెల్లి తండాను సందర్శించి సీసీ రోడ్డు పనులు ప్రారంభించాలని స్థానిక సర్పంచ్ అధికారులను కోరారు.
కార్యక్రమంలో ఏఈపిఏ వినోద్ కుమార్ ఆయా గ్రామపంచాయతీ కార్యదర్శులు ఉప సర్పంచ్ గ్రామస్తులు పాల్గొన్నారు.
