వికలాంగులు, సంక్షేమం ,
Kura Yadaiah /చీఫ్ ఎడిటర్ /September 12,2025,


వికలాంగుడినైనా నాకు కొత్త పాస్ పుస్తకం మంజూరు చేసి ఆదుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు శుక్రవారం నేనావత్ పాండు ఫిర్యాదు చేశారు……
వికారాబాద్ /హిందు 9 న్యూస్ 12:వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం మారేపల్లి తాండ కు చెందిన నేనావత్ పాండు తమ పూర్వికులు అంటే అవ్వ తాతల నుండి సంక్రమించిన సర్వే నంబర్ 116/49 లో గల,
2-20:00 గుంటల భూమిని నేను గత 20′” సంవత్సరాల” నుండి జీవనోపాధికై సాగు చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నానని ఇప్పటివరకు నాకు ఈ భూమి పై కొత్త పాసు బుక్కు ఇవ్వలేదని తక్షణమే పాసుబుక్కు అందించాలని శుక్రవారం రోజు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పాండు ఫిర్యాదు చేశారు. అయితే ఈ భూమిని మా అవ్వ తాత అమ్మ నాన్నలు జీవనోపాధికై పంట చేసుకుని బ్రతుకుతుండేవారని తర్వాత ఈ యొక్క భూమిని మా అవ్వ తాతలు మా అమ్మ నాన్నలు వికలాంగుడి నైనా నాకు బ్రతకడానికి ఇచ్చారని పాండు తెలిపారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఈ యొక్క సర్వే నంబర్ పై పట్ట పాసు బుక్కు మంజూరు చేసి ప్రభుత్వం ఆనాడు నాకు ఇచ్చిందని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాకు మాత్రం పాసుబుక్కు రాలేదని తెలిపారు.నాకు పాసు బుక్కు అందకపోవడంతో కొంత ఆర్థిక పరిస్థితుల వల్ల నేను బొంబాయి వలస వెళ్లి బతికానని తర్వాత మళ్లీ ప్రస్తుతం మా స్వగ్రామానికై బతుకుదెరువు నిమిత్తం వచ్చానని తెలిపారు. బ్రతకడానికి నాకు ఎలాంటి ఆధారం లేకపోవడంతో ఇదే భూమిని ఆసరాగా చేసుకుని జీవిస్తానని తెలిపారు.ప్రభుత్వం గతంలో ఇచ్చిన పాసుబుక్కును ఉదారిస్తూ కొత్త పాస్ పుస్తకం అందివ్వాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
