ముఖ్యాంశాలు,
Kura yadaiah| January 23,2026,
హిందు 9న్యూస్ బ్యూరో :


ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు వికారాబాద్ జిల్లాలో సర్పంచులుగా గెలుపొందిన బీసీ సర్పంచులకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 24 తారీకు రోజున వికారాబాద్ పట్టణం నందు సన్మాన కార్యక్రమం ఉంటుందని జాతీయ బీసీ అగ్ర నేత కందుకూరి రాజ్ కుమార్ తెలిపారు……..
తాండూర్:ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీసీ సర్పంచులకు జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో 24 తారీకు శనివారం రోజున వికారాబాద్ పట్టణంలోని గౌలికర్ ఫంక్షనల్ లో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందకూరి రాజ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
జాతీయస్థాయి బీసీ అగ్ర నేతల హాజరు,
ఈ కార్యక్రమానికి జాతీయస్థాయి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, ప్రముఖ బీసీ నాయకులు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, స్వామి గౌడులు హాజరవుతారని తెలిపారు. సన్మాన అనంతరం బీసీ సర్పంచులకు పాలన విధానాలపై దిశా నిర్దేశం సలహాలు సూచనలు అందిస్తూ బీసీ ఉద్యమాన్ని మరింత ఉదృతంగా ముందుకు తీసుకుపోయే విధంగా వక్తలు ప్రసంగిస్తారని రాజ్ కుమార్ పేర్కొన్నారు.

బీసీ లందరూ హాజరుకండి,
కాబట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నలుమూలల నుండి వికారాబాద్ జిల్లా నుండి బీసీ సర్పంచులు ప్రజాప్రతినిధులు బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని రాజ్కుమార్ పిలుపునిచ్చారు.
