పెద్దెముల్ మండల బిఆర్ఎస్ జడ్పిటిసి అభ్యర్థి గా రవీందర్ నాయక్.!

రాజకీయం

Kura Yadaiah| October 7,2025,

Peddamul zptc| పెద్దేముల్ మండలం బిఆర్ ఎస్ జడ్పిటిసి అభ్యర్థిగా మన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన రవీందర్ నాయక్ ను పార్టీ నాయకత్వం ఎంపిక చేస్తున్నట్లు విశ్వాసనీయ  సమాచారం……..

హిందు 9 న్యూస్ ప్రత్యేక ప్రతినిధి :

Peddemul zptc |పెద్దేముల్ మండల జెడ్పిటిసి బీఆర్ఎస్ అభ్యర్థిగా రవీందర్ నాయక్ వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు ఒక సమాచారం. రవీందర్ నాయక్ పెద్దేముల్ మండలం మన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలో కొనసాగినప్పుడు కొండాపూర్ ఎంపీటీసీ అభ్యర్థిగా తాను పోటీ చేసి గెలుపొందిన విషయం విధితమే, ఎంపీటీసీగా ఉన్నప్పుడు స్థానికంగా ప్రజలతో సత్సంబంధాలను కొనసాగించి ఎలాంటి వర్గ విభేదాలు లేకుండా అందరితో కలుపుగోలుగా ప్రజలను ఇటు నాయకులను సమన్యాయంగా చూస్తూ ఎంపీటీసీగా ప్రజల్లో మంచి ఆదరణ అభిమానం పొందిన వ్యక్తిగా గుర్తింపు నోచుకున్నారు.

-యువజన నాయకుడి నుండి రాజకీయ నేతగా,

గతంలో రవీందర్ నాయక్ తన రాజకీయ ప్రస్తానాన్ని గ్రామంలో యువజన సంఘం అధ్యక్షులుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ విద్య ,బాల కార్మిక వ్యవస్థ తదితర అంశాలపై యువజన సంఘం అధ్యక్షులుగా ఉన్న రోజుల్లో గ్రామంలో సేవ కార్యక్రమాలను అలవర్చుకొని అక్కడి నుండి తన రాజకీయ  నాయకత్వ లక్షణాలను వంట పట్టుకొని ఒక్కొక్క మెట్టుగా రాజకీయ ప్రస్థానం కొనసాగించి నేటి పెద్దేముల్ మండల జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ కి అర్హత సాధించారు. ఎంపీటీసీగా ఉన్నప్పుడు బి ఆర్ ఎస్ పార్టీ మండల పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నాయకులతో సఖ్యతగా మెలిగి స్థానిక మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి లాంటి వ్యక్తుల్లో కూడా తాను సముచిత స్థానం సంపాదించుకున్నారు. రవీందర్ నాయక్ అంటే సౌమ్యుడుగా కలుపుగోలు తనం గల వ్యక్తిగా హంగు ఆర్భాటం లేకుండా ప్రజల అందరితో కలిసి పోయే వ్యక్తిగా కూడా పార్టీలో  మంచి గుర్తింపు పొందిన వ్యక్తిగా పేరు ఉంది. కాబట్టి బిఆర్ఎస్ పార్టీలో ఇటు కార్యకర్తల అటు నాయకుల చూపు కూడా రవీందర్ నాయక్ పైనే ఉన్నట్లు సమాచారం. మండల పార్టీ నాయకత్వం మిగిలిన ఎంపిటిసి అభ్యర్థుల గెలుపు గుర్రాల కోసం నాయకత్వం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బిఆర్ఎస్ జడ్పిటిసి అభ్యర్థిగా రవీందర్ నాయక్ ను నిలబెట్టాలని పార్టీ వర్గాలు మండల పార్టీ నాయకత్వం కూడా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *