నివాళులు
Kura Yadaiah| October 7,2025

Vkb |వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ నివాళులు అర్పించారు……
హిందు 9 న్యూస్ వికారాబాద్ :
Vkb |వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం రోజు మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ పాల్గొని వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహర్షి వాల్మీకి మన దేశానికి ఆదర్శప్రాయమైన కవి ఆధ్యాత్మిక గురువు అని ఆయన రచించిన రామాయణం ద్వారా సత్యం ధర్మం న్యాయం నిష్కమసేవ వంటి విలువలను సమాజానికి చాటి చెప్పారని కలెక్టర్ అన్నారు.
ఆయన చూపిన మార్గంలో నడిచి ప్రతి ఒక్కరు నిజాయితీ నిబద్దతతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ సుధీర్ అసిస్టెంట్ కలెక్టర్ ఆర్స్ చౌదరి డిఆర్ఓ మంగిలాల్ బీసీ వెల్ఫేర్ అధికారి మాధవరెడ్డి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
