వికలాంగులు,
K, Yadaiah August 30,2025,

వికలాంగుల స్థలాలు ఎవరైనా కబ్జాలు చేస్తే కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తాటతీస్తామని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య కబ్జాదారులను హెచ్చరించారు……..
హైదరాబాద్ : వికలాంగులకు సంబంధించిన ఎలాంటి స్థలాలనైనా కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని తాట తీస్తామని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య కబ్జాదారులను హెచ్చరించారు. ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలో tcpc స్థలం కబ్జాకు గురైందని ఫిర్యాదులు అందడంతో స్పందించిన చైర్మన్ స్థానిక జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారికి ఫోన్ చేసి కబ్జా విషయంపై విచారణ జరిపి నిజ నిజాలను నిగ్గు తేల్చి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత ఆర్డిఓ కు కబ్జా జరిగిన స్థలాన్ని పరిశీలించాలని తక్షణమే అక్కడికి వెళ్లి విచారణ జరపాలని,జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా డి డబ్ల్యు ఓ కు, కూడా జరిగిన ఘటనపై నిజా నిజాలు తెలుసుకోవాలని చైర్మన్ ఆదేశాలు ఇచ్చారు. కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ ( cp ) ను కూడా ఇట్టి విషయంలో మాట్లాడుతానని ఫిర్యాదుదారులకు చైర్మన్ హామీ ఇచ్చారు.
