మధు యాష్కి నీ పలకరించిన,mlc, పట్నం మహేందర్ రెడ్డి,

రాజకీయం

Kura Yadaiah| September 18,2025,


  • మధు యాస్కిని పలకరించిన పట్నం మహేందర్ రెడ్డి 
  • పలకరింపులో మహేందర్ రెడ్డి కి మంచి పేరే,

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మధుయాష్క గౌడ్ అనారోగ్యానికి గురి కావడంతో తనను తన నివాసములో గురువారం రోజు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పలకరించి పరామర్శించారు…….

తాండూర్:  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ ఇటీవల సచివాలయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మధుయాష్కి గౌడ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో గురువారం రోజు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మధుయాష్కి గౌడ్ నివాసానికి వెళ్లి పలకరించారు. తన ఆరోగ్య పరిస్థితిపై జరిగిన పరిణామాలపై మధుయాష్కి గౌడ్ ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మధుయాష్ కి గౌడ్ త్వరగా కోలుకోవాలని ఎప్పుడూ ప్రజల కోసం ప్రజల మధ్య ఉండే మధుయాష్కి గౌడ్ మళ్లీ ప్రజలతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు. తన ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించొద్దని మధుయాష్కి గౌడ్ ను సూచించినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా మధుయాస్కీ గౌడ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండాలని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మహేందర్ రెడ్డి.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *