ముఖ్యాంశాలు,
Kura Yadaiah /March 2,2026,
హిందు 9 న్యూస్ :

సొంత పార్టీ మీటింగ్లకు ముందస్తు అరెస్టులతో పనేముందని సొంత పార్టీ మీటింగులు పెట్టుకుంటే ప్రజాసంఘాలను వామపక్షాలను ప్రతిపక్షాలను చివరకు ప్రజా ఉద్యమాలతో ఏ సంబంధం లేని వ్యక్తులను మందస్తు అరెస్టు చేయడం వారి హక్కులకు భంగం కలిగించడమేనని వికారాబాద్ ప్రజా కుల సంఘాలు మండిపడ్డాయి.
హిందు 9 న్యూస్ (వికారాబాద్ 2,) : సొంత పార్టీ మీటింగ్ కు జిల్లాలోని ప్రజాసంఘాలను కుల సంఘాలను ప్రతిపక్షాలను వామపక్షాలను ముందస్తు అరెస్టు చేయడం ఏంటని అధికారంలోకి రాకముందు ప్రజాస్వామ్య హక్కులను కాపాడుతామంటూ ఇప్పుడు సొంత పార్టీ మీటింగ్లకు కూడా ముందస్తు అరెస్టులు చేసి ఇబ్బంది పెట్టడం సరైన చర్య కాదని పి ఓ డబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి వై గీత, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వై మహేందర్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు తేజ ఎంఆర్పిఎస్ జిల్లా నాయకురాలు వై పుష్పరాణి లు ప్రభుత్వ చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మండిపడ్డారు.
సోమవారం రోజు వికారాబాద్ అనంతగిరి కొండపై ఏర్పాటు చేసిన తెలంగాణ డిసిసి అధ్యక్షుల ముగింపు సందర్భంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులో భాగంగా ఈ సందర్భంగా అన్నారు.
-ప్రజా ఉద్యమాలతో సంబంధం లేని వ్యక్తులను ముందస్తు అరెస్టు చేయడం హక్కులకు భంగం కలిగించడమే?
సొంత పార్టీ మీటింగులు పెట్టుకుంటే కూడా ప్రతిపక్షాలను వామపక్షాలను ప్రజా ఉద్యమాలతో ఎలాంటి సంబంధంలేని వ్యక్తులను కూడా ముందస్తు అరెస్టుల పేరుతో ఇబ్బంది పెట్టడం వారి హక్కులకు భంగం కలిగించడమేనని ఇది పూర్తిగా ఆశస్పదంగా ఉందని స్పష్టం చేశారు.
దేశంలో బిజెపి విధానాలతో ప్రజాస్వామ్యం పై దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిరసనలకు పిలుపునివ్వకుండా ముందస్తు అరెస్టులు చేయడం తగదని హెచ్చరించారు. అరెస్టులు చేయడం వల్ల పార్టీ ప్రజలకు దూరమయ్యే అవకాశాలు ఉంటాయని ప్రజల్లో వ్యతిరేకత భావాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ గుర్తురగాలని పేర్కొన్నారు.
-ముందస్తు అరెస్టులు కాదు, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ తీసుకోవాలి,
బహు భాషలు సంస్కృతులు మతాలు ఉన్న దేశంలో అందరి గొంతు వినిపించే అవకాశం రాజ్యాంగం కల్పించిందని, ఆ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం దేశంలో బలమైన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ దేనిని హితవు పలికారు.
దేశంలో ప్రజాస్వామ్య రక్షణ రైతు కార్మిక నల్ల చట్టాలు కార్పొరేట్ వ్యవస్థ వ్యవసాయం ఉద్యోగ అవకాశాలు డేటా భద్రత అమెరికాతో ట్రేడ్ డీల్ విషయాలపై మాట్లాడుతున్నారు.
కానీ అదే విషయాల మీద నిరంతరం ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే కమ్యూనిస్టులను ప్రజా సంఘాలను ముందస్తు అరెస్టు చేయడం బిజెపి విధానాలను అవలంబించడం అవుతుందని తెలిపారు.
–రాహుల్ గాంధీ పర్యటన ఉంటే అది పార్టీ పరంగా ఉంటుంది, ముందస్తు అరెస్టులకు సంబంధం ఏటి?
రాహుల్ గాంధీ పర్యటన ఉంటే అది పార్టీ పరంగా ఉంటుంది, ఆ పర్యటనకు ముందస్తు అరెస్టులకు ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. అనవసరంగా ఇలాంటి అరెస్టులు చేసి సంఘాలను ప్రతిపక్షాలను వామపక్షాలను హైలెట్ చేయడమే అవుతుందని అన్నారు.
కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం భూములను అడవులను అప్పజెప్పి జరిపే బుల్డోజర్ పాలనపై రాహుల్ గాంధీ పోరాడుతారు ,కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ప్రజా పాలన పౌర మానవ హక్కులకు ప్రజాస్వామ్య హక్కులకు రక్షణ కల్పిస్తామని గతంలో చెప్పిన పార్టీ తీరిగ్గా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల నివాసాలు ఏ రాత్రి వచ్చి ఎవరు కూల్పుతారోనని ప్రజలు భయభయంగా బతుకుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల నివాసాలు కూల్చడం పచ్చని అడవులు నరకడం అభివృద్ధి పేరుతో పేదల భూములు ప్రభుత్వ భూములను గుంజుకోవడం దళితుల మీద ఆదివాసీలు మహిళల మీద దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని అన్నారు.
-లేబర్ కోడులను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయరు?
కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్మిక వర్గానికి నష్టం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయడం లేదో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుల పైన బీసీల పైన జరుగుతున్న దాడులను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి బాధ్యతలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
