సామాజిక వార్తలు,
హిందు 9 న్యూస్ 14/4/2026,

-
దేశంలో బీసీ రాజ్యం వచ్చిన కూడా బీసీలకు అన్యాయమే? తెలంగాణ పేరిక అసోసియేట్ అధ్యక్షుడు ఆక రాధాకృష్ణ,
-
మహిళా బిల్లులో బహుజన మహిళవాట తేల్చాలి? పటేల్ వనజ, అరుణ,
దేశంలో ప్రజలు అంబేద్కర్ స్ఫూర్తితో బీసీ వాటా సాధించుకునేందుకు సిద్ధం కావాలని హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తూ తెలంగాణ పేరిక అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షుడు ఆక రాధాకృష్ణ అన్నారు…
హనుమకొండ : అంబేద్కర్ స్ఫూర్తితో బీసీ వాటా సాధించుకోవాలని తెలంగాణ పేరిక సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఆక రాధాకృష్ణ అన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను పురస్కరించుకొని అనుమకొండ జిల్లా కేంద్రం సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ సందర్భంగా ప్రసంగించారు.
ఇప్పటికీ మూడు సార్లు బీసీ ఓట్లతోని India లో అధికారంలోకి వచ్చిన బిజెపి బీసీలకు తీరని నష్టం చేకూరుస్తున్నదని ఆయన అన్నారు.
బీసీ రాజ్యం వచ్చిన కూడా బీసీలకు ఇప్పటికీ దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రపంచ దేశానికి పోరాటా రూపాలను తెలియచెప్పిన తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం కృషి చేస్తున్న రేవంత్ సర్కారుకు ఆదిపత్య కులాలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుపడడం పొరపాటుగా మారిందని పేర్కొన్నారు.
ఇప్పటికైనా దేశంలో రాష్ట్రంలో బీసీలు ఒక్కతాటిపైకి వచ్చి అంబేద్కర్ స్ఫూర్తితో బీసీ వాటకై పూర్తిస్థాయిలో కదం తొక్కాలని పిలుపునిచ్చారు.
మోడీ ప్రభుత్వానికీ బీసీల పట్ల బీసీ రిజర్వేషన్ల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆల్ ఇండియా ఓబీసీ జాక్ వైస్ చైర్మన్ పటేల్ వనజ, అరుణలు అసహనం వ్యక్తం చేశారు.
మహిళా బిల్లులో బహుజన కోటా లేకుండా అమలు చేస్తే దేశవ్యాప్తంగా మహిళలను ఏకతాటి పైకి తీసుకొచ్చి అంబేద్కర్ ఫూలే స్ఫూర్తితో పోరాటాన్ని ఎత్తుకుంటామని హెచ్చరించారు.
బిజెపి వెంటనే మహిళా బిల్లులు బహుజన కోట తేల్చాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పేరిక సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారు, చింతం లక్ష్మీనారాయణ హనుమకొండ జిల్లా అధ్యక్షులు సాయిని నరేందర్ రాష్ట్ర నాయకులు బేర కేదారి, డాక్టర్ చిరం శెట్టి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
