రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ను మర్యాదపూర్వకంగా కలిసిన, హిందు 9 న్యూస్ ప్రతినిధి బృందం,

ప్రగతి వార్తలు,

హిందు 9 న్యూస్ 31/3/2026,

______ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తో, హిందు 9 న్యూస్ ప్రతినిధి బృందం భేటీ,

____దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమంపై వెనక్కి తగ్గేది లేదు, చైర్మన్ ముత్తినేని వీరయ్య,

రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ను మంగళవారం రోజు  హిందు 9 న్యూస్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు…

హైదరాబాద్ : రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యను హిందు 9న్యూస్ “chief in editor” కూర యాదయ్య మంగళవారం రోజు హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చంతో   శుభాకాంక్షలు తెలిపారు.

_______ఇందిరమ్మ ఇండ్లలో 5% రిజర్వేషన్ పక్కాగా అమలు ,

ఈ సందర్భంగా రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమం అభివృద్ధి ఇందిరమ్మ ఇళ్ల లో 5% రిజర్వేషన్ నూతన పింఛన్లు దివ్యాంగులకు ఉద్యోగాలలో ప్రమోషన్లు , దివ్యాంగులకు హయ్యర్ ఎడ్యుకేషన్ లో రిజర్వేషన్లు, సబ్సిడీ రుణాలలో 5% రిజర్వేషన్లు, దివ్యాంగులకు వివాహ ప్రోత్సాహక బహుమతి 2, లక్షలు, తదితర అంశాలపై చర్చించడం జరిగింది.

ఇప్పటికే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు దాదాపుగా 4, వేయిల మంది దివ్యాంగులకు వచ్చాయని అవి కూడా పూర్తి కావస్తున్నాయని చైర్మన్  స్పష్టం చేసినట్లు హిందు 9 న్యూస్ తెలిపింది.

హిందు 9 న్యూస్ ప్రతినిధి బృందం అడిగిన పలు ప్రశ్నలకు చైర్మన్ స్పందించి   సంక్షేమ పథకాల అమలు అభివృద్ధి పై క్లుప్తంగా వివరించినట్లు తెలిపింది.

ప్రతిపక్షాలు కొన్ని సంఘాలు తమపై కావాలని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని వ్యక్తిగత దూషణలు చేయడం వారికి సాంప్రదాయం అనిపించుకోదని హలో నేను కూడా విమర్శలు చేయదలుచుకుంటే అనేకం ఉన్నాయని అభివృద్ధిలో దివ్యాంగుల సమస్యల పట్ల తాను ఎప్పుడూ ముందే ఉంటానని హిందు 9 న్యూస్ తో తన అభిప్రాయాన్ని పంచుకున్నట్లు తెలిపింది.

ఇంకా దివ్యాంగులకు పరిష్కరించాల్సిన సమస్యలు రాష్ట్రంలో చాలా ఉన్నాయని వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఎడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో చర్చించి తప్పకుండా దివ్యాంగులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని  చెప్పుకొచ్చారు.

త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ జిల్లాల వారిగా పర్యటన కార్యక్రమాలను కూడా చేపట్టబోతున్నట్లు చర్చకు వచ్చినట్లు హిందు 9 న్యూస్ ప్రకటించింది.ఈ కార్యక్రమంలో ఎం డి అంజాద్ తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *