ప్రభుత్వం, కార్మికలు
హిందు 9 న్యూస్ |కే, యాదయ్య
వెట్టి చాకిరీ విముక్తి రాష్ట్రంగా తెలంగాణ|కార్మిక మంత్రి వివేక్,

Labour |తెలంగాణ రాష్ట్రాన్ని వెట్టి చాకిరి విముక్తి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ స్పష్టం చేశారు…..

Labour |హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని వెట్టిచాకిరి విముక్తి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని శుక్రవారం రోజు హైదరాబాదు నందు ఏర్పాటుచేసిన వెట్టి చాకిరీ విముక్తి సదస్సులో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ స్పష్టం చేశారు. అయితేఎప్పుడో చాలా కాలం క్రితం వెట్టి చాకిరి అనే మాట పుస్తకాలలో చదువుకున్నాం, అలాగే పల్లెల్లో విన్నాం చూశాం, శుక్రవారం రోజు హైదరాబాదు నందు వెట్టి చాకిరీ విముక్తి సదస్సు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెట్టి చాకిరీ విముక్తి సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ పాల్గొనగా అతిథిగా బ్లూ క్రాస్ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల పాల్గొన్నారు.
ఈ వెట్టి చాకిరీ విముక్తి సదస్సులో పాల్గొన్న అనేక కుటుంబాలు తమ గోడును వినిపించుకున్నాయి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో వెట్టి పనులు చేస్తూ ఏళ్ల తరబడి చిత్రహింసలు భరించామని తీసుకున్న కొద్దిపాటి అప్పులకు ఏళ్ల తరబడి పనిచేసామని బాధ్యత కుటుంబాలు సదస్సుల్లో ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకున్న కొద్దిపాటి అప్పుకు ఎల్ల తరబడి పని చేశామని పనిచేయకపోతే చిత్రహింసలు పెట్టేవారని తినడానికి సరైన ఆహారం కూడా ఇచ్చేవారు కాదని సదస్సులో బాధితులు గోడు వెలబోసుకున్నారు. వెట్టి చాకిరి చేస్తూ నానా అవస్థలు పడ్డ కుటుంబాలు వారి బాధలు వర్ణాతితం ఒక్కొక్కరి కుటుంబానిది ఒక్కొక్క బాధ సదస్సులో వారి బాధలు విన్న తర్వాత అందర్నీ కాల్చివేసింది.

వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రోజు నిర్వహించిన వెట్టి విముక్తి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని వెట్టి చాకిరీ విముక్తి రాష్ట్రంగా చేస్తామని ఆ దిశగానే ప్రభుత్వం పని చేస్తుందని వెట్టి చాకిరీ విముక్తి రాష్ట్ర నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ అన్నారు.
వెట్టి చాకిరి విముక్తి పొందిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు తో పాటు ఆర్థిక సహాయం ,తెల్ల రేషన్ కార్డులు, విద్య ఆరోగ్య సదుపాయాలు సన్న బియ్యం లాంటివి అందిస్తామని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వెట్టి చాకిరి కుటుంబాలు ఉండకూడదని వారిని వెట్టి నుండి విముక్తి చేసే లక్ష్యంగానే ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.
