Rajkumar|బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజకీయ పార్టీల ద్వంద వైఖరి వీడాలి?, బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్

రిజర్వేషన్, అభిప్రాయం

Hindu 9 news|k, Yadaiah

బీసీ రిజర్వేషన్ల విషయంలో| రాజకీయ పార్టీల ద్వంద వైఖరి వీడాలి|
-జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్,

Rajkumar|బీసీల రిజర్వేషన్ల విషయం లో రాజకీయ పార్టీలు తమ ద్వంద వైఖరిని వీడి సామాజిక న్యాయం, సమన్యాయం కోసం తమ తమ పార్టీల వైఖరి ఏంటో చెప్పాలని?  బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.

Rajkumar BC |తాండూర్ : బీసీల రిజర్వేషన్ల విషయంలో ప్రతి రాజకీయ పార్టీ తమ ద్వంద  వైఖరి విధానాన్ని వీడాలని స్వార్ధ ప్రయోజనాల కోసం బీసీలను వాడుకోవడం మానుకోవాలని బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీ రిజర్వేషన్లపై డ్రామాలు చేయడం అసెంబ్లీలో ఒక మాట కేంద్రంలో మరో మాట ఈ పద్ధతి మంచిది కాదని ఇది ఒక కుల వర్గానికి సంబంధించిన అంశం అని దానిని అడ్డం పెట్టుకొని రాజకీయ స్వార్థం కోసం వాడుకోవద్దని రాజకీయ పార్టీలు బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఇతవు పలికారు. తెలంగాణలో స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించి బీసీ బిల్లు రాష్ట్ర శాసనసభ లో ఏకగ్రీవంగా ఆమోదం పొందినప్పటికీ ఈ బిల్లు గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తుంది ఈ ప్రక్రియలో కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ డ్రామాలాడుతున్నారని రాజ్కుమార్ మండిపడ్డారు.

బీసీలను ఇదేవిధంగా తమ స్వార్ధ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని బీసీలు కూడా ఆ దిశగా ఎందుకు ఆలోచిస్తాలేరో బీసీలు తెలుసుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బీసీ జనాభా ప్రస్తుతం విద్య ఉద్యోగాల్లో 29 శాతం స్థానిక సంస్థలు 21 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు. గతంలోనే బిఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్లను పెంచి ఉంటే బాగుండేదని అలా చేయకపోవడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందుతుందని అన్నారు. బిజెపి పార్టీ రాష్ట్ర శాసనసభలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు మందుతూ ఇచ్చినప్పటికీ కేంద్రంలో దీనిని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడానికి ఆసక్తి చూపడం లేదని బిజెపి బిఆర్ ఎస్ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.స్వార్ద రాజకీయాల్ని పక్కన పెట్టి సామాజిక న్యాయం కోసం బీసీ రిజర్వేషన్లు బిల్లును చిత్తశుద్ధితో మళ్ళి చేయడానికి రాజకీయ పార్టీలు కృషి చేయాలని కోరారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *