ముఖ్యాంశాలు,
హిందు 9 న్యూస్ 18/3/2026,

_______తెలంగాణ సీఎస్ పదవీకాలం పొడిగింపు,
తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీ కాలాన్ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది ఆగస్టులో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. అప్పట్లో ఏడు నెలలు పొడిగించారు. తాజా పొడిగింపుతో ఆయన మరికొంత కాలం సీఎస్గా బాధ్యతలు నిర్వహించనున్నారు.
