Hand gun with ammunition on dark background. 9 mm pistol military weapon and pile of bullets ammo at the metal table.

రితేష్ రెడ్డి గన్ లైసెన్స్ రద్దు చేయాలని, సైబరాబాద్ సి పి, కి లేఖ రాసిన, సిట్ అధికారులు!

నేర వార్తలు,

హిందు 9 న్యూస్/17/3/2026,

________మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం,

పైలెట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేస్ రోజు రోజుకు మరింత మలుపు తిరుగుతుంది రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి వివిధ పరిణామాలను జరిగిన తీరును చూస్తే రితీష్ రెడ్డి గన్ దుర్వినియోగపర్చినట్లు  తేలింది.  తన గన్ లైసెన్స్ ను రద్దు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు సిట్ ,ప్రత్యేక (బృందం) లేఖ రాసింది…..

తెలంగాణ బ్యూరో : పైలెట్ రోహిత్ రెడ్డి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ వ్యవహారం కేసు రోజురోజుకు మరింత మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి గన్ లైసెన్స్‌ను రద్దు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సిట్ అధికారులు లేఖ రాశారు. రితేష్ రెడ్డికి 2017లో సైబరాబాద్ పోలీసులు గన్ లైసెన్స్ జారీ చేశారు.

అయితే ఇటీవల జరిగిన పరిణామాల్లో రివాల్వర్‌ను దుర్వినియోగం చేసినట్లు సిట్ గుర్తించింది. దీంతో ఆయుధం వినియోగం పై నిబంధనలను ఉల్లంఘించి నందుకు తక్షణమే గన్ లైసెన్స్ ను రద్దు చేయాలని సిపి,కి సిఫారసు చేసింది.

ఇదిలా ఉండగా, పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వ్యవహారం కూడా సిట్ దృష్టిలోకి వచ్చింది. రంగా రెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని ఈ ఫామ్ హౌస్ అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్ ను సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులకు లేఖ రాసినట్టు విశ్వాసనీయ సమాచారం.

చట్టపరమైన ప్రక్రియల అనంతరం త్వరలోనే సీజ్ చర్యలు చేపట్టే అవకాశం ఉందని పోలీస్  వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా ఈ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమవు తుండగా, రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశ ముంది.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *