అవినీతిపై విజిలెన్స్ అంతర్గత విచారణ.!

ముఖ్యాంశాలు,

Kura Yadaiah/ March 3/2026,

హిందు 9 న్యూస్ బ్యూరో :

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతిపై విజిలెన్స్ అధికారులు ఎన్నడూ లేనివధంగా దాడులను ముమ్మరం చేసి ఇప్పటికే అనేకమంది అవినీతి అధికారులపై కేసులు నమోదు చేసి అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టించడమే కాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతిపై మళ్లీ విజిలెన్స్ అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు…!

హిందు 9 న్యూస్( బ్యూరో 3) :రాష్ట్రంలో అవినీతి జరిగిన తీరు తెన్నులపై విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంతర్గత విచారణ జరుపుతున్నట్లు విశ్వాసమే సమాచారం. జిహెచ్ఎంసి సహా వివిధ శాఖలపై వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా వివరాలు సేకరిస్తూ సంబంధిత డిపార్ట్మెంట్ లతో కూడిన చిట్టాను సిద్ధం చేయడానికి పూనుకుంది.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఏసీబీ కేసులు సహా బాధితులనుంచి అందుకున్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తుంది. వీటితోపాటు పలు వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఆయా శాఖలపై ప్రత్యేక నిఘా ను పెట్టింది. వీటిపై అంతర్గతంగా విచారణ జరిపి నివేదికలు రూపొందిస్తున్నది.

ఇందులో భాగంగానే రాష్ట్రంలోని పలు సంక్షేమ హాస్టల్స్ లో సోదాలు జరపడంతో పాటు ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన రిపోర్టులను ప్రభుత్వానికి నివేదిక అందించింది. పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నది.

-మూడు శాఖలపైనే విజిలెన్స్ ప్రత్యేక గురి,

రెవెన్యూ జిహెచ్ఎంసి ఆర్టిఏ శాఖలపై గత కొంతకాలంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులకు అనేక రకాలుగా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది. అందిన ఫిర్యాదులపై విజిలెన్స్ అధికారులు అత్యంత రహస్యంగా దర్యాప్తును వేగవంతం చేశారు. అందుకోసం ప్రత్యేక ప్రశ్నావళి ని రూపొందించడం డిపార్ట్మెంట్ వారిగా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. స్థానిక అధికారులకు ఎలాంటి అనుమానం రాకుండా వివరాలను సేకరిస్తున్నారు.

బాధితుల నుండి ఫిర్యాదుల ఆధారంగా అంతర్గత విచారణ…

-క్షేత్రస్థాయిలో సమాచారంను సేకరించి నివేదికలు సిద్ధం,

హెచ్ఎంసి రెవెన్యూ ఆర్టిఏ డిపార్ట్మెంట్ల పైన ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయని అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై గట్టి నిఘా ను పెడుతున్నారు. ఆయా ప్రాంతాలలో ప్రభుత్వం సేవల గురించి అంతర్గత విచారణ జరుపుతున్నారు ఇందుకోసం సంబంధించి ప్రభుత్వ శాఖలపై రిపోర్టులను ప్రభుత్వానికి నివేదికల రూపంగా అందించారు. వికారాబాద్ జిల్లాలో కూడా అక్రమ విస్తరణ రాత్రి వేళల్లో జోరుగా సాగుతున్న ప్రజల్లో పుకార్లు షికారులు చేస్తున్నాయి. రెవెన్యూ కార్యాలయాల్లో రైతులను ప్రజలను అవినీతి జలగలు పీడిస్తున్నట్టు ఆరోపణలు చాలానే ఉన్నాయి. విజిలెన్స్ శాఖ వికారాబాద్ జిల్లా అక్రమ ఇసుక రవాణా కొన్ని రెవెన్యూ ప్రత్యేక దృష్టిని సారించాల్సిన అవసరం ఉందని ప్రజల్లో ఒక భావన ఉంది.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *