ముఖ్యాంశాలు
Kura Yadaiah| February 2026,
హిందు 9 న్యూస్ :

రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న వికలాంగుల హాస్టల్ను హోమ్స్ ను పూర్వపు హైదరాబాదు పరిధిలోకి మార్చాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య ఆ శాఖ డైరెక్టర్లకు వికలాంగుల విద్యార్థులు వికలాంగుల సంఘాల నాయకులతో కలిసి గురువారం రోజు హైదరాబాద్ డైరెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు…
హిందు 9 న్యూస్ (హైదరాబాద్ 19): రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న వికలాంగుల హాస్టల్ లో ఉన్న వికలాంగుల విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని గతంలో హైదరాబాదు పరిధిలో ఉండడం వల్ల వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు జరగలేదని తక్షణమే రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న హాస్టల్ హోమ్స్ హైదరాబాద్ పరిధిలోకి తీసుకురావాలని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆ శాఖ డైరెక్టర్లను కోరారు.
గత సంవత్సరం నుండి పెండింగ్ లో ఉన్న కాస్మోటిక్ చార్జీలు నోట్ బుక్స్ ప్లేట్లు గ్లాసులు అలాగే హాస్టల్ హోమ్స్ లలో శానిటేషన్ కోసమై బల్బులు ఇతర సామాగ్రి కొనుగోలు కోసం నెలకు 30 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గతం నుండి విద్యార్థులకు ఇస్తున్న దుస్తులను ప్రతి సంవత్సరం దసరా పండుగకు ఇవ్వాలని విన్నవించారు. కార్యక్రమంలో వికలాంగుల నేతలు మోరిగాడి నరసింహ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
