ముఖ్యాంశాలు,
Kura Yadaiah| February 2016,
హిందు 9 న్యూస్ బ్యూరో :

జిన్నారంలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు గురువారం రోజు సర్పంచ్ హుస్సేన్ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు…
హిందు 9 న్యూస్ (కోటపల్లి 19) :వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం జిన్నారం గ్రామంలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు గ్రామ సర్పంచ్ హుస్సేన్ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం చేపట్టారు.
గురు వారం రోజు చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా గ్రామంలో యువకులకు ఇచ్చిన మాటకు కట్టుబడి విగ్రహ ఏర్పాటుకు పూనుకున్నట్లు సర్పంచ్ తెలిపారు.
ఇలాంటి మహాయోధుల ఆశయాలు ఆలోచనలను యువత ముందుకు తీసుకెళ్లాలని గ్రామ ప్రజల సహకారంతో యువకుల ప్రోత్సహంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లేశం మాజీ ఎంపీటీసీ నర్సింలు గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
