సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి

ముఖ్యాంశాలు 

Kura Yadaiah| February 17,2026

హిందు 9 న్యూస్ బ్యూరో :

-సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో విప్లవత్మక మార్పులు తీసుకురావాలి, రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య,

-2004-2014, వరకు యూపీఏ ప్రభుత్వం అసమాన తలను రూపుమాపే సంక్షేమ పథకాలపై హక్కు కల్పించింది, ప్రముఖ సంపాదకులు డాక్టర్ కే శ్రీనివాస్,

-మోడీ ప్రభుత్వం అమెరికా కన్ను సన్నుల్లో  నూతన ఆర్థిక సరళీకరణ విధానాలు అమలు చేస్తున్నారు? రిటైర్ ప్రొఫెసర్ కోదండరాం,

Government Schemes|దేశంలో గాని రాష్ట్రంలో గాని ప్రభుత్వాలు రూపొందించే సంక్షేమ పథకాలు ప్రజల మౌలిక జీవితాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని 1971లో గరీబి హటావో సంక్షేమ పథకాల అమలుకు ఆనాడు ఇందిరాగాంధీ శ్రీకారం చుట్టిందని రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య గుర్తు చేశారు….

Government schemes|హిందు 9 న్యూస్( వరంగల్ ); దేశంలో గాని రాష్ట్రాలలో గాని ప్రభుత్వాలు రూపొందించే సంక్షేమ పథకాలు ప్రజల మౌలిక జీవితాలలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తే బాగుంటుందని సామాజిక తత్వవేత్త ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. సోమవారం రోజు కాకతీయ యూనివర్సిటీ రాజమతి శాస్త్ర విభాగంలో కేయూ రిజిస్టర్ రామచంద్రం ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఈ సందర్భంగా ప్రసంగించారు. నాటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ 1971లో గరీబి హటావో సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టిందని ఆయన గుర్తు చేశారు. 1991 నుండి దేశంలో అమలవుతున్న సరళీకరణమైన విధానాలు వందలాది అగ్రవర్ణ ప్రైవేటు పెట్టుబడిదారుల వ్యాపార విస్తరణ కోసం 90 శాతం ఉపయోగపడుతున్నాయని ఐలయ్య ఆరోపించారు.

10% మాత్రమే గ్రామీణ ప్రజలకు ఉపయోగపడ్డదని స్పష్టం చేశారు. సమాజంలో అన్ని రంగాలలో అసమానతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. ప్రస్తుత సమాజంలో నిరాశ నిస్పృహ అసంతృప్తులను చల్లార్చడానికి ఓట్లు సీట్లు రాజకీయ అధికారం సుస్థిరం చేసుకోవడానికి సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని ఆయన విమర్శించారు.

మోడీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో 40% నిధులు కార్పొరేట్ పెట్టుబడుదారుల అభివృద్ధికి కేటాయిస్తున్నదని ఆరోపణ చేశారు. దేశంలో పేదలకు ఉచిత విద్య వైద్యంతో పాటు వృద్ధులు వికలాంగుల అభివృద్ధికి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించి అమలు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

2004 నుండి 2014 వరకు కేంద్ర యూపీఏ ప్రభుత్వం అసమాన తలను రూపుమాపడానికి సంక్షేమ పథకాలు వివిధ రకాల చట్టాలను తీసుకువచ్చిందని సంక్షేమ పథకాలపై ప్రజలకు హక్కు కల్పించిందని ప్రముఖ సంపాదకులు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కె శ్రీనివాస్ తెలిపారు. అయితే దేశంలో నేడు కొనసాగుతున్న మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మార్కెటీకరణ లో సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా నిర్వీర్యమైపోతున్నాయని అభిప్రాయపడ్డారు.

పేదరికం ఆకలి చావులు ఆత్మహత్యల నుండి విముక్తి చేసేవి నిజమైన సంక్షేమ పథకాలని మోడీ ప్రభుత్వం అమెరికా కన్ను సన్నుల్లో నూతన ఆర్థిక సరళీకరణ విధానాలు అమలు చేస్తున్నాడని రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అమెరికా యూరోప్ దేశాలతో పాటు వ్యాపార వాణిజ్య ఒప్పందాలు దేశ ప్రజల ప్రయోజనాలకు తీవ్ర నష్టకరంగా మారే ప్రమాదం ఉందన్నారు. 18 శాతం సుంకాలు చెల్లించడం సంవత్సరానికి 550 మిలియన్ డాలర్ల వస్తువులు దిగుమతి చేసుకోవాలని ఒప్పందం చేసుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ప్రమాదకరాన్ని సూచిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.అనంతరం సెమినర్లో వివిధ పరిశోధకులు సమర్పించిన సెమినార్ ఆర్టికల్స్ వాల్యూమ్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్య బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ గడ్డం కృష్ణయ్య రిటైర్డ్ ప్రొఫెసర్ సిహెచ్ దినేష్ కుమార్ జి వీరన్న డాక్టర్ హరిప్రసాద్ అధ్యాపకులు, డాక్టర్ వడ్లకొండ సత్యనారాయణ డాక్టర్ నాగరాజు డాక్టర్ తిరుపతి డాక్టర్ సంజీవ్ రీచర్చ్ స్కాలర్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *