రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తాం-వికారాబాద్ జిల్లా నాలుగు మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం, రాష్ట్ర ఐటీ, వికారాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,

ముఖ్యాంశాలు 

Kura Yadaiah| February 6,2026,

హిందు 9 న్యూస్ బ్యూరో ;

-మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించబోతున్నాం,

-వికారాబాద్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది,

-రాబోయే రోజుల్లో పాత తాండూర్ ను కొత్త రూపు రేఖలతో అభివృద్ధి చేసుకొని కొత్త తాండూరు గా పీల్చుకోబోతున్నాం, రాష్ట్ర ఐటీ వికారాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు,

Minister Sridhar Babu|రాష్ట్రంలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలను గెలిచి ప్రభంజనం సృష్టించిందని ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా అధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని దాంట్లో భాగంగానే వికారాబాద్ జిల్లాలో ఉన్న మొత్తం నాలుగు ముంచిపాలిటీలపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని రాష్ట్ర ఐటీ శాఖ వికారాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రకటించారు…

హిందు 9 న్యూస్ (తాండూర్ 6;)రాష్ట్రంలో గత స్థానిక సంస్థల్లో అధిక సర్పంచ్ గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో నిలిచిందని ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించబోతుందని దాంతో పాటుగానే వికారాబాద్ జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వికారాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.


శుక్రవారం రోజు వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జిల్లా డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ లతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని పాత తాండూర్ గాంధీ చౌక్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మీ ఎమ్మెల్యే మీ స్థానికుడే విద్యావంతులకు యువకులకు పార్టీ కోసం కష్టపడి శ్రమించి పనిచేస్తున్న అభ్యర్థులకు గొప్ప అవకాశాన్ని కల్పించారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో తాండూర్ అభివృద్ధిలో భాగంగా పాత తాండూర్ ను కొత్త రూపు రేఖలతో అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తామని పాత తాండూర్ ను రాబోయే రోజుల్లో కొత్త తాండూరుగా పిలువబోతారని మంత్రి జోష్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పాలన కొనసాగిస్తున్న సందర్భంలో ప్రతి కుటుంబంకు ప్రభుత్వం నుంచి ఏదో ఒక సంక్షేమ పథకం అందించడం జరిగిందని ఆ దిశగా ప్రజలు ఆలోచించుకోవాలని పేర్కొన్నారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరెంటు చార్జీలు పెరిగితే రోడ్లపై ధర్నాలు రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్తును 200 యూనిట్ల వరకు అందిస్తున్నామని ఇది కదా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని పేర్కొన్నారు.

మాటల ప్రభుత్వము కాదు చేతల ప్రభుత్వం మాది,

మాటల ప్రభుత్వముగా కాకుండా చేతుల ప్రభుత్వంగా ప్రజా ప్రభుత్వంలో దాదాపుగా యువతీ యువకులకు 50 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించడం తెలంగాణ చరిత్రలో మొదటిసారి అని ఆయన గుర్తు చేశారు. త్వరలో రాబోయే కొన్ని రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం దాదాపుగా తొమ్మిదేళ్లు పరిపాలించిన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందించలేని చరిత్ర వాళ్లదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం పంపిణీ చేయడమంటే పేదలపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఆప్యాయతలను తెలియజేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో బిజెపి బీఆర్ఎస్ చీకటి ఒప్పందాన్ని చేసుకుని ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నారని ఘాటుగా మండిపడ్డారు.

స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో తాండూరు అభివృద్ధికి అశేషంగా కృషి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సహా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆ దిశగా తాండూర్ ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్ల గా  పోటీ చేస్తున్న అభ్యర్థులను ఆదరించి చేతు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *