ఆలోచన ఎందుకు ఒక్కసారి బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చి చూడండి, కాంగ్రెస్ మాయమాటలను నమ్మి మళ్ళీ మోసపోకండి!, పైలెట్ రోహిత్ రెడ్డి,

ముఖ్యాంశాలు,

Kura yadaiah| February 6,2026;

హిందు 9న్యూస్ బ్యూరో ;

-ఆలోచన ఎందుకు ఒక్కసారి బిఆర్ఎస్కు అవకాశం ఇచ్చి చూడండి,

-అభివృద్ధిలో రాష్ట్ర మునిసిపాలిటీలతో పోటీ పడదాం,

-కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మళ్ళీ మోసపోకండి, పైలెట్ రోహిత్ రెడ్డి,

Pilot Rohit Reddy|  ఆలోచన ఎందుకు ఒక్కసారి బిఆర్ఎస్ కు అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధిలో దూసుకుపోతాం కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మళ్ళీ మోసపోకండి తాండూర్ మునిసిపాలిటీలో పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్థులను మీ మీ అన్నదమ్ములుగా భావించి ఆదరించండి….

హిందు 9న్యూస్ (తాండూర్ 6;)ఒక్కసారి బి ఆర్ ఎస్ కు అవకాశం ఇచ్చి చూడండి, కాంగ్రెస్ మాయమాటలను నమ్మి మళ్ళీ మోసపోకండి,మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులకు ఒకసారి ఆలోచించి అవకాశం ఇచ్చి చూడాలని కాంగ్రెస్ పార్టీ మాయమాటలను నమ్మి మరోసారి మోసపోవద్దని అధికార పార్టీపై ఆరోపణలు చేస్తూ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా తన ప్రచార నిర్వహిస్తూ ప్రసంగించారు. శుక్రవారం రోజు  ప్రార్థనల ముగింపు తర్వాత 7, వార్డు పరిధిలోని దర్గా మజీద్ అలాగే నూర్ ఉలూమ్ మదర్స మసీదులలో ముస్లిం మైనార్టీ ప్రజలను కలిసి ఈ సందర్భంగా కోరారు. గతంలో తాండూర్ మునిసిపాలిటీని ఎలా అభివృద్ధి చేశామో అందరూ చూశారని ప్రతి గల్లి గల్లి సిసి రోడ్లు మురుగు కాలువల నిర్మాణం ప్రతి వార్డుల్లో పచ్చదనం ప్రతి కుటుంబానికి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన మంచినీరు అందించామని బిఆర్ ఎస్ అభ్యర్థులను తమ అన్నదమ్ములుగా భావించి ఆదరించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మాయమాటలను నమ్మి మళ్ళీ ఇక్కడి ప్రజలు మోసపోవద్దని ప్రచారంలో కాంగ్రెస్ పై విమర్శల దాడి పెంచారు. బిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిలిచి పారదర్శకత పాలనకు శ్రీకారం చుట్టాలని స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీ ప్రజలు గతంలో బీఆర్ఎస్ ను ఆదరించారని ఈసారి కూడా ఆదరించి అండగా నిలబడాలని వారిని కోరారు. బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ముస్లిం మైనార్టీ ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని తాండూర్ అభివృద్ధిలో తామంతా భాగస్వాములు కావాలని వారికి వివరించారు. పట్లోళ్ల నర్సింలు చైర్మన్ అయితే తాండూరు పట్టణం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ రాష్ట్ర మునిసిపాలిటీలలో పోటీ పడుతుందని మీ సహకారం తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల వైపు ఉండాలని వారిని అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు, విజయ్ కుమార్ టి రమేష్, జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు యువకులు పార్టీ సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *