31 వ వార్డు అభివృద్ధి, సంక్షేమం, నాకు రెండు కళ్ళ లాంటివి-అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి చేసుకుందాం-BRS కౌన్సిలర్ అభ్యర్థి అవుసుల యోగానంద్,

ముఖ్యాంశాలు,

Kura  Yadaiah| February 6,2026

హిందు 9 న్యూస్ బ్యూరో ;

-బీద సాదల పాటు అన్ని వర్గాలకు అండగా ఉంటా,

-వికలాంగుల కోసం వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకుందాం,

-మా తండ్రి అడుగుజాడల్లోనే ప్రజలకు సేవ చేస్తాం,

Yoganand BRS |వార్డు అభివృద్ధి సంక్షేమం నాకు రెండు కళ్ళ లాంటివని అందరి భాగస్వామ్యంతో వార్డును అభివృద్ధి చేసుకుందామని ఎప్పుడు ప్రజలతోనే ఉంటే స్వచ్ఛమైన పాలన అందిస్తామని 31వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అవుసుల యోగానంద్ ప్రజలను కోరారు….

హిందు 9 న్యూస్ (తాండూర్ 6); అభివృద్ధిని చేసి చూపిస్తా నేను మాటిస్తున్న ప్రజల సంక్షేమం విద్యా వైద్యం వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం అని 31 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి అవుసుల యోగానంద్ ఇంటింటి ప్రచారంలో ప్రజలను కోరారు .శుక్రవారం రోజు తన సహచర బిఆర్ఎస్ నాయకులతో సమిష్టిగా కలిసి వార్డు  ప్రచారాన్ని నిర్వహించారు. మురుగు కాల్వల నిర్మాణం రహదారులు వీదిలేట్లు ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన మంచినీరు అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వంతో సాధ్యమైనంత నిధులు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూనే చేతనైనంత స్వయంగా ముందుకొచ్చి  వార్డును అభివృద్ధి చేసుకోవడంలో చొరవ చూపిస్తామని మాటిచ్చారు.

మాజీ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి రాజ్ గౌడ్ లతో యోగానంద కౌన్సిలర్ అభ్యర్థి 31 వార్డ్

-ఒంటరి మహిళలు వృద్ధులు వికలాంగుల కోసం వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకుందాం,

ఒంటరి మహిళలు వృద్ధులు వికలాంగుల కోసం ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా ప్రజలకు అందించడానికి ముందుంటామని తెలిపారు. వార్డులో పేద విద్యార్థుల కోసం వారి విద్యాభివృద్ధి కోసం ఉచిత నోట్ పుస్తకాలతో పాటు పై విద్య అభివృద్ధికి కూడా వారికి అండగా నిలబడతామని యోగనంద్ అన్నారు.

మిషన్ భగీరథ ఎక్కడైతే లేదో అక్కడ మిషన్ భగీరథ పైప్లైన్ వేయించడం సురక్షితమైన నీరును వార్డులోని ప్రజలకు అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

-బీద సాదల కోసం అన్ని వర్గాలకు అండగా ఉంటా,

ఎవరైనా బీదలు చని పోయిన వారికి సహకారాలు అందించి అండగా నిలబడతామని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం వార్డులో మార్నింగ్ వాక్ చేస్తూ సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు తప్పకుండా ముందుంటామని ఆయన అన్నారు.

-మా తండ్రి అడుగుజాడల్లోనే ప్రజలకు సేవ చేస్తాం,

గతంలో మా తండ్రిగారు స్వర్గీయ అవుసుల సత్యం కొనసాగించిన స్నేహపూర్వక వాతావరణం ఆయన ప్రజలకు చేసిన సేవలను గుర్తించుకుంటూ నేను కూడా ఆయన బాటలోనే నడుస్తానని ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎప్పుడు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. కాబట్టి వార్డులో ఉన్న ప్రతి ఓటరు తమను గుర్తించి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తప్పకుండా గెలిపించి అండగా నిలబడాలని తన అశభావాన్ని వ్యక్తం చేశారు. బీద సాద ప్రజల కోసం తమ ప్రయాణం తమ గమ్యం ఉంటుందని వార్డులో ఉన్న ప్రతి ఓటరును గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు. రోహిత్ రెడ్డి నాయకత్వంలో తాండూర్ అభివృద్ధితోపాటు ఈ వార్డును అభివృద్ధి చేసుకొని ముందుకు వెళ్దామని వార్డు అభివృద్ధి కోసం మీ అందరూ నాకు సపోర్ట్ గా ఉండాలని ఓటర్లను కోరారు. ప్రజలందరినీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *