సామాజిక వార్తలు,
హిందు 9 న్యూస్ 11/4/2026,

_____కేంద్ర రాష్ట్ర పాలకులు పులే స్ఫూర్తితో ప్రజలకు సేవా చేయాలి,
_______పులే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని మంచి సమాజం కోసం పోరాడాలి, బిఆర్ ఎస్ నేత శ్రీశైల్ రెడ్డి,
పూలే త్యాగం మహోన్నత ఆశయ సమ సమాజం కోసమని సావిత్రిబాయి జ్యోతిరావు పులే దంపతుల అవిరాల కృషి వల్లనే భారత దేశ బహుజనులకు విద్య అందిందని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి శ్రీశైల్ రెడ్డి అన్నారు…..
తాండూర్ : పులే త్యాగం మహోన్నత ఆశయ సమ సమాజమని మహాత్మ పులే సందేశం అందరికీ అనుసరణీయమని సావిత్రిబాయి జ్యోతిరావు పులే దంపతుల అవిరాల కృషి వల్ల భారత దేశ బహుజనులకు విద్య అందిందని బిఆర్ఎస్ తాండూర్ ఇంచార్జ్ ,రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి శ్రీశైలం రెడ్డి అన్నారు.
మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా తాండూరులో పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
విద్య లేక వివేకం లేదు వివేకం లేక వికాసం లేదు వికాసం లేక పురోగతి లేదు అన్న పులే సందేశం భారత బహుజనులపై ప్రభావం చూపిందని అలా బహుజనులు చైతన్యవంతులు కాగలిగారని అన్నారు. మాత్మ జ్యోతిరావు పులే సందేశమే ప్రామాణికమయ్యిందని పేర్కొన్నారు.
- కేంద్ర రాష్ట్ర పాలకులు పులే స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలి,
కేంద్ర రాష్ట్ర పాలకులు పులే స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. యువత పులే మార్గాన్ని అనుసరించి మంచి సమాజం నిర్మాణానికి తోడుపాటును అందించాలని గుర్తు చేశారు.

కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు వెంకటరెడ్డి శ్రీనివాస్ చారి ఉమా శంకర్ నరేందర్ గౌడ్ సిద్ధిరాల శ్రీనివాస్ పాండురంగారెడ్డి సలీం రమేష్ శకుంతల చంద్రశేఖర్ రెడ్డి రాములు ఇర్ఫాన్ వీరయ్య సంతోష్ గౌడ్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
