ఎన్నికలు
Kura Yadaiah| January 7,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో : –

జనవరి 30 తారీఖున జరుగు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకలను సామాజిక దృక్పథం కలిగిన న్యాయవాదులకు తమ అమూల్యమైన ఓట వేసి గెలిపించాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ బార్ కౌన్సిల్ అభ్యర్థి చలకాని వెంకట్ యాదవ్ కోరారు……
bar council election|తాండూర్: తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికలు జనవరి 30 తారీఖున జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సామాజిక ప్రజా ఉద్యమాల అనుభవం దృక్పథం నిరంతరం సామాజిక న్యాయం కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ న్యాయవాదుల సంక్షేమం భక్తుల కోసం పోరాటం చేస్తున్నటువంటి తెలంగాణ హైకోర్టు న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్ పోటీకి నిలబడ్డ సంగతి అందరికీ తెలిసిందే, అయితే జనవరి 30 తారీకు జరగబోయే క్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలను పురస్కరించుకొని బుధవారం రోజు వికారాబాద్ జిల్లా తాండూర్ కోర్టులో పనిచేస్తున్న సీనియర్ న్యాయవాది గోపాల్ ఇతర న్యాయవాదులతో కలిసి బార్ కౌన్సిల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చలకాని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ జనవరి 30 తారీఖున జరగబోయే తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకలను సామాజిక ప్రజా ఉద్యమాల దృక్పథం సామాజిక న్యాయం కోసం న్యాయవాదుల సంక్షేమం హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న తనకు తాండూర్ ప్రాంతంలో ఉన్న న్యాయవాదులందరూ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును వేసి ప్రశ్నించే గొంతుకలను సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న తనను గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్ న్యాయవాదులను కోరారు. న్యాయవాదులు అంటే సామాజిక దృక్పథం సామాజిక అన్యాయం మేధావులుగా సమాజంలో కొలువబడుతున్నారని ఆయన అన్నారు. కాబట్టి ప్రశ్నించే గొంతుకలను ఈ ఎన్నికల్లో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని న్యాయవాదులకు పిలుపునిచ్చారు.

నన్ను గెలిపిస్తే న్యాయవాదులకు సామాజిక న్యాయం అందిస్తా ప్రశ్నించే గొంతుక నౌత, చలకాని వెంకట్ యాదవ్,
తనను గెలిపిస్తే సామాజిక న్యాయం కోసం నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటానని న్యాయవాదుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని వారికి హెల్త్ కార్డులతో పాటు న్యాయవాదుల రక్షణ చట్టం కై మహిళా న్యాయవాదులకు ప్రత్యేకించి హెల్త్ కార్డుల అంశంతో పాటు నిరంతరం మిగతా న్యాయవాదుల సమస్యలపై కొట్లాడుతానని వారి సంక్షేమం అభివృద్ధి ప్రశ్నిస్తానని చెలకని వెంకట్ యాదవ్ పేర్కొన్నారు. న్యాయవాదులకు ఎలాంటి సమస్య ఉన్న తాను ముందుంటానని కాబట్టి తాండూరు ప్రాంతంలో ఉన్న న్యాయవాదులందరూ తమ తమ అమూల్యమైన ఓటును 30 తనకు వేసి గెలిపించాలని మరోసారి తాండూర్ ప్రాంతా న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో న్యాయవాదులు పరిగి యాదయ్య, విప్లవ కుమార్ దాసరి శ్రీనివాస్ యాదవ్, సత్తీష్, లింగస్వామి, తాండూర్ న్యాయవాదులు సుదర్శన్, ఎండి మస్తాన్, అరుణ, కమలాకర్, రామ్మోహన్, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
