ప్రజలకు పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి, వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి

హోం 

Kura Yadaiah |November 21,2025,

హిందు 9 న్యూస్ బ్యూరో :

ప్రజలకు పోలీసులు ఎప్పుడు అందుబాటులో ఉండాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు శుక్రవారం రోజు ఎస్పీ కార్యాలయంలో సబ్ డివిజన్ల అధికారుల సమీక్ష సమావేశంలో ఈ సందర్భంగా పేర్కొన్నారు……

వికారాబాద్ జిల్లా :-ప్రజలకు పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం రోజు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సబ్ డివిజన్ లో పోలీస్ అధికారుల సమీక్ష సమావేశంలో ఈ సందర్భంగా అన్నారు. జిల్లాలు ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు దర్యాప్తు పురోగతి అలాగే వివిధ పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల స్థితి గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు జిల్లా ఎస్పీ కే నారాయణరెడ్డి. కేసుల పరిష్కారంలో జాప్టన్ జరగకుండా చూడాలని పరితగతిన పూర్తి చేయాల్సిన కేసులను వెంటనే ముగించాలని ఆయన పోలీసు అధికారులకు సూచించారు. సామాన్యులకు న్యాయం అందించడంలో ఆలస్యం జరగకూడదని ప్రతి ఫిర్యాదు పై చట్టపరమైన విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.

రాబోయే స్థానిక ఎన్నికలు నేపథ్యంలో పటిష్టమైన నిగా ఏర్పాటు చేయాలి,

రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో తమ పోలీస్ స్టేషన్లో పరిధిలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలకు మిగతం కలవకుండా ముందుగానే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సమీక్ష సమావేశంలో సబ్ డివిజన్ల పోలీస్ అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సరించాలని ముఖ్యంగా హైవేలపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఎస్పీ కోరారు.మహిళలు చిన్నారులపై జరిగే నేరాల విషయంలో సున్నితంగా వ్యవహరించి దర్యాప్తును ఆలస్యం చేయకుండా వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. వారికి తక్షణ న్యాయమందుల కృషి చేయాలని అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో మరింత నమ్మకం పెరిగేలా పనిచేయాలని అధికారులను కోరారు.

ప్రతి కేసు దర్యాప్తులో శిక్ష శాతం పెరిగే విధంగా చూడాలి,

ప్రతి కేసు దర్యాప్తులో శిక్ష శాతం పెరిగే విధంగా పకడ్బందీగా విచారణ చేయాలని ఆన్లైన్ మోసాలు సైబర్ నేరాలు జరగకుండా ప్రత్యేక దృష్టి పోలీసులు సరించాలని ఎస్పీ నారాయణరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.

కార్యక్రమంలో జిల్లా అదనపు ఎఎస్పీ బి రాములు నాయక్ వికారాబాద్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి పరిగి డిఎస్పి తాండూర్ డిఎస్పి ఎన్ యాదయ్య డిసిఆర్బి డిఎస్పి జానయ్య జిల్లాలోని ఇన్స్పెక్టర్లు సర్కిల్ ఇన్స్పెక్టర్లు RI,లు ఎస్సైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *