ఎన్నికలు
Kura Yadaiah| November 28,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :–

Election update|పెద్దేముల్:- పెద్దేముల్ మండల్ కందనెల్లి తండా సర్పంచ్ అభ్యర్థిగా రాథోడ్ ఆనంద్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రోజు కందనెల్లి నామినేషన్ క్లస్టర్ లో కందనెల్లి తాండ సర్పంచి అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను తన తోటి అనుచరులతో కలిసి దాఖలు చేసినట్లు రాథోడ్ ఆనంద్ నాయక్ తెలిపారు.

ప్రజల యువకుల అభిమతం మేరకు అభివృద్ధి
ఇక్కడి ప్రజల యువకుల అభిమతం మేరకు గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తాను నామినేషన్ దాఖలు చేసినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నానని నాయక్ తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో పద్మా రతన్ సింగ్ బొజ్జా నాయక్ గోపాల్ రాంశెట్టి నాందేవ్ నితీష్ నాయక్ కే లక్ష్మణ్ గోబ్ర్యా మహేష్ లోక్యా నాయక్ అశోక్ హనుమంతు కరణ్ తదితరులు పాల్గొన్నారు.
