వినాయక మట్టి విగ్రహాలను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం, బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్,

పండుగలు

10 /ఆగస్టు /2025

హిందు 9 న్యూస్ స్టాప్

Vinayaka celebration| వినాయక మట్టి విగ్రహాలను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం, కులవృత్తులకు అండగుందామని బిసి సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు…..

Vinayaka celebration|తాండూర్ :వినాయక చవితి సమీపిస్తున్న సందర్భంగా ప్రతి ఇంట్లో ప్రతి వినాయక మండపాలలో మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలని కుల వృత్తులకు గౌరవం ఇచ్చి కాపాడుకుందాం అంటూ జాతీయ బీసీ సంఘం  state member కందుకూరి రాజ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహించి మంచి సాంప్రదాయాన్ని ప్రజల్లో తీసుకొచ్చే విధంగా చూడాలని తాండూరు ప్రజలకు తాగునీటి వనరులకు ఏకైక వసతిగా ఉన్న కాగ్న నదిని కలుషితం చేయకుండా ప్రజలు తోడ్పాటున తోడ్పాటు అందించే విధంగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం రోజు తాండూర్ దస్తగిరి పేట గ్రామంలో ఎన్ని ఏళ్లుగా మట్టి విగ్రహాలను తయారు చేస్తున్న కుమ్మరి శంకర్ కుటుంబాన్నీ ఈ సందర్భంగా కలుసుకొని ప్రోత్సహించారు. మనిషి జీవితంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే కుల వృత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆరోగ్యవంతమైన జీవితాలను గడపాలంటే రంగుల కలలకు స్వస్తిఫలకాలని ఆకాంక్షించారు. తప్పకుండా ఇలాంటి కుల వృత్తుల వాళ్లకు అండగా నిలబడతామని వారికి ప్రభుత్వం తరఫున సాయ సహకారాలు అందే విధంగా కృషి చేస్తామని రాజకుమార్ పేర్కొన్నారు.

Vikarabad Dist తాండూర్ మండలం దస్తగిరి పేటలో తయారు చేస్తున్న విగ్రహాలు ఎనిమిది అంగుళాల నుండి ఐదు అడుగుల వరకు ఉంటున్నాయని ఎవరైనా మట్టి విగ్రహా 99908876875, శంకర్ అనే వ్యక్తిని సంప్రదించాలని తెలిపారు. ఈ విషయమై హిందూ సంఘటన్ తరపున ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి ఇలా ను కలిసి మద్దతు కోరినట్లు రాజ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ సుకుర్ గడ్డం వెంకటేష్ మహిళా నాయకురాలు నరసమ్మ మంజుల పెద్దేముల్ మండలం యువజన అధ్యక్షుడు నవీన్ బషీరాబాద్ మండల్ అధ్యక్షుడు జగదీశ్వర్ సిద్ధార్థ గౌడ్ బీసీ యువజన నాయకులు రాము ముదిరాజ్ వివేక్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *