పోలీసు
Kura Yadaiah| November 27,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :-


–పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి,
-ఆస్తి సంబంధిత నేరాలు దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి,
-కేసులను త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలి,
Police vkb | వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమేహ్రా గురువారం రోజు చెనుగోమూల్ పోలీస్ స్టేషన్ను అకస్మికంగా తనిఖీ చేశారు సర్పంచ్ ఎన్నికల అదృష్ట పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు……
Police vkb/ వికారాబాద్ |: సర్పంచ్ ఎన్నికలు దృష్ట్యా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికలకు సంబంధించిన ముందస్తు సమాచారం సేకరించి పెట్టుకోవాలని జిల్లా పోలీస్ అధికారులకు జిల్లా పోలీసులకు సూచించారు. గురువారం రోజు జిల్లాలోని చెనుగోముల్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమేహ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణను సిబ్బంది విధుల నిర్వహణను రికార్డుల నిర్వహణను పోలీస్ స్టేషన్ రిసెప్షన్ లాకప్ గదుల వంటి వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చెనుగోముల్ పోలీస్ స్టేషన్ చరిత్ర పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించిన వివిధ వివరాలను ఎస్పీ తెలుసుకున్నారు. గతంలో ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను ప్రస్తుతం విచారణలో ఉన్న కేసుల వివరాలను వాటి పురోగతిని స్టేషన్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. కేసుల విచారణలో నాణ్యత పాటించాలని నిందితులను శిక్ష పడే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా ఫోక్సు అట్రాసిటీ మహిళలు బాలింతలకు సంబంధించిన కేసులో అలాగే గ్రీవెన్ కేసులలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కేసులను వేగవంతంగా పరిష్కరించే విధంగా అధికారులు చూడాలని స్పష్టం చేశారు.

ఆస్తి సంబంధిత నేరాలు దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి,
ఆస్తి సంబంధిత నేరాల పైన దొంగతనాల పైన ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించి విధుల్లో క్రమశిక్షణతో నిబద్ధతతో పనిచేయాలని ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చేనుగోలు ఎస్సై భరత్ కుమార్ రెడ్డి మరియు స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
