Oplus_131072

సంక్షోభ కాలం సామాజిక మార్పు ప్రజా గ్రంథాలయాలు ఆవశ్యకత, రంగవల్లి 25వ వర్ధంతి సందర్భంగా తరలిరండి, ఆర్ వి కె అధ్యక్షురాలు అరుణోదయ విమలక్క,

కర్ర పత్రం

Kura Yadaiah|November 8,2025,

హిందు 9 న్యూస్ బ్యూరో :

కరీంనగర్ : సంక్షోభ కాలం సామాజిక మార్పు ప్రజా గ్రంథాలయాల ఆవశ్యకత రంగవల్లి స్మారక ఉపన్యాసాలు RVk ప్రథమ వార్షికోత్సవం,కామ్రేడ్ రంగవల్లి అమరత్వానికి 26 ఏళ్లు హామీ 25వ వర్ధంతి సందర్భంగా వేములవాడలో నిర్మాణమైన రంగవల్లి విజ్ఞాన కేంద్రం( ఇంకా నిర్మాణం పూర్తి కావాలి) ప్రారంభించబడి సంవత్సరం నిండింది. కావున రంగవల్లి విజ్ఞాన కేంద్రం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 2025 నవంబర్ 11 నాడు ఉదయం 10 గంటలకు సంక్షోభ కాలం సామాజిక మార్పు ప్రజా గ్రంథాలయాల ఆవశ్యకత అని అంశంపై రంగవల్లి స్మారపు ఉపన్యాసాలు ఉంటాయని రంగవల్లి విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు ఆర్ వి కె అధ్యక్షురాలు అరుణోదయ విమలక్క తెలిపారు. అందరూ హాజరుకావాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు రంగవల్లి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి అందర్నీ ఆహ్వానిస్తున్నామని ఆమె అన్నారు.కామ్రేడ్ రంగవల్లి భారత విప్లవ ఉద్యమం అందించిన వీరమణి మనలో ఒకరు ఉన్నత విద్యావంతురాలుగా మార్క్సిస్ట్ విజ్ఞాన వేత్తగా స్త్రీ విముక్తి కార్యకర్తగా ప్రజా విముక్తి సేనానిగా జనశక్తి నాయకురాలిగా అన్నింటికీ మించి గొప్ప మానవతా వాదిగా తన పాతికేళ్ల విప్లవ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిందని చెప్పుకొచ్చారు.

ఆమె 1999 నవంబర్ 11న ఎన్కౌంటర్లో మరణించి మనకు భౌతికంగా దూరమై 26 ఏళ్లు అవుతున్న ఆమె విప్లవ ఔన్నత్యానికి ఆమె త్యాగనిరతి తోడయ్యింది. అది రంగవల్లిని సదా అజరామరం చేస్తుంది. ఆ విధంగా ఆమె విప్లవ జీవితానికి 50 ఏళ్లు నిండాయని భావించడం కూడా అనుచితంగా ఉంటుంది. కామ్రేడ్ రంగవల్లికి ప్రేరణ ఇచ్చిన (కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ తాను పుట్టి పెరిగిన నిజాంబాద్ జిల్లా వాసి) 1975 నవంబర్ ఐదు నాకు కాల్చి చంపబడినాడు. నేడు ఆయన 50వ వర్ధంతి జరుగుతుందుని తెలిపారు .ఈ 50 ఏళ్ల కాలంలో రెండు తరాలు ఉండవచ్చిన మార్పులు ఎన్నో ఉన్నాయి.1975 అత్యవసర పరిస్థితి కాలంలో దేశ అంతరంగిక భద్రత పేరిట పౌర హక్కులను రాజ్యాంగ సవరణ ద్వారా తాత్కాలికంగా సస్పెండ్ చేస్తే నేడు ఎలాంటి ఎమర్జెన్సీలు లేకుండానే జీవించే హక్కుతో సహా రాజ్యాంగపు ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. . కుల వివక్ష నానాటికి వెర్రి తలలు వేసి పరువు హత్యలుగా దిగజారుతుంది. మతమౌడ్యం ముదిరిపోతుంది. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా ఇంకాదిగజారిపోతున్నాయి. ప్రకృతి ప్రకోపం మితిమీరి పోతుంది. యుద్దాల కంటే ఇది ఎన్నో రెట్లు నష్టం కలుగజేస్తుంది. అభివృద్ధి పేర విధ్వంసకార నమోనా రాజ్యమేలుతున్నది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న పని భారం పెరుగుతూనే ఉంది. ఆకలి చావులు తగ్గిన ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ స్థితిలో వివిధ రూపాలలో ప్రజా పోరాటాలు మరొకవైపు పాలకుల అణచివేత విధానాలు పెరుగుతూనే ఉన్నాయని ఆందోళన పడ్డారు.
ఈ సమయంలో సమాజంలో మౌలిక మార్పుల కోసం పోరాడుతున్న అభ్యుదయ శక్తులు వివిధ రూపాల్లో చీలిపోయి ఉన్నారు.అభివృద్ధి నిరోధక శక్తులు సంఘటిత దాడులకు ఎగబడుతున్నారు. అందుకే ఈ సంక్షోభ కాలంలో సామాజిక మార్పు దిశగా ఏం చేద్దాము మాట్లాడుకుందాం రండి అలాగే రంగవల్లి విజ్ఞాన కేంద్రం లాంటి ప్రజా గ్రంథాలయాల పాత్ర ఎలా ఉండాలో జరిగే చర్చల్లో భాగస్వామ్యం కండి కావాలని అరుణోదయ విమలక్క పిలుపునిచ్చారు.

సభ వేదిక :-
సభా పరిచయం:
పోకల సాయికుమార్ న్యాయవాద విద్యార్థి
సభ అధ్యక్షత
అరుణోదయ విమలక్క ఆర్ వి కె అధ్యక్షురాలు

అంశం:-

(సంక్షోభ కాలం సామాజిక మార్పు)

వక్త ప్రొఫెసర్ కొల్లాపురం విమల(రచయిత్రి సామాజిక ఉద్యమ కారిని)

అధ్యక్షత రాజేశ్వరి ఆర్ వి కె సభ్యులు
అంశం:-
(ప్రజా గ్రంథాలయాలు ఆవశ్యకత)
జూలకంటి జగన్నాథం ప్రముఖ కవి,
వందన సమర్పణ:- చిన్నమనేని పురుషోత్తమరావు ఆర్ వి కే సభ్యులు,
(నవంబర్ 11 ఉదయం 10 గంటలకు  నంది కమాన్ వేములవాడ సభ జరుగు స్థంలం

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *