వ్యాసాలు
Kura Yadaiah| November 2025
హిందు 9 న్యూస్ బ్యూరో :-

బీసీ రాజ్యాధికార యుద్ధాన్ని బలంగా నిర్మించడానికి బలమైన ఐక్యత లోతైన చారిత్రక దృక్పథంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రక్త బంధాలను గుర్తు చేసుకోవడానికి జంబుద్వీప జన జాతరకు సిద్ధము కావాలని హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్ పటేల్ అన్నారు….
తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులారా !
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అని తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దరన్న పోరాటపాటతో పోరులో ఊరికిన మనం “నేడు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా బీసీ యుద్ధమా!”అని పాడుకోవాల్సిన సందర్భంలో మనమున్నాం. సమతా మమతల మహాజన సమాజం నిర్మాణం కోసం జరిగే యుద్ధం తెలంగాణ నేలపైన స్పష్టమైన బీసీ ఉద్యమ రూపం తీసుకుంది. గతంలో జరిగిన అనేక ఉద్యమాలు తెలంగాణ సాయుధ పోరాటం, కమ్యూనిస్టు విప్లవోద్యమం, “మేమెంత మందిమో – మాకంత వాటా” ఇరుసుగా మారోజు వీరన్న మార్గ దర్శకత్వంలో కుల ప్రజాస్వామిక ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం దేశానికే స్ఫూర్తిదాయకం. అయితే ఎప్పటికప్పుడు అప్పటివరకు జరిగిన ఉద్యమాలను సమీక్షించుకుంటూ సవరించుకుంటూ సరికొత్త రూపం తీసుకుంటూ సాగే సజీవంగా ప్రవాహంలా తెలంగాణ నేల మీద ఉద్యమాలు సాగుతూ ఉంటాయి. మూడు వేల ఏండ్ల కిందట దేశంలో వేల్లూనుకున్న మనువాదం తెలంగాణను సంపూర్ణంగా ఆక్రమించుకోలేకపోయింది. మనువాదం దేశం మొత్తాన్ని సంపూర్ణంగా తన కబ్జాలోకి తీసుకున్న ప్రస్తుత సందర్భంలో తెలంగాణను లొంగదీసుకోవడానికి తన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంది. అయితే తెలంగాణ ఉద్యమ శక్తులు తిప్పికొడుతూనే ఉంటాయి. అయితే ఇక్కడి శూద్ర అగ్రవర్గం అయిన రెడ్డి వర్గం నయా క్షత్రీయ వర్గంగా మారి మనువాదాన్ని నిలబెట్టే బాధ్యత తీసుకుంది.
మహాత్మ జ్యోతిరావు పూలే ఆలోచనను స్వీకరిద్దాం,
దీన్ని ముందుగానే పసి గట్టిన బీసీ ఉద్యమం మనువాదానికి మందు నూరి పెట్టుకుంది. దాంట్లో భాగంగానే “రక్త సంబంధాల కన్నా వర్గ సంబంధాల మిన్న” అనే గత నినాదాన్ని సవరించుకొని రక్త సంబంధాలు వర్గ సంబంధాలు ఒకదానికొకటి పోటీ కాదని, రక్త సంబంధాలు వర్గ సంబంధాలు దేని ప్రాధాన్యత దానిదేనని, మూడు వేల ఏళ్ల కిందట బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు రక్త సంబందీకులేనన్న పూలే ఆలోచన స్వీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జంబుద్వీప భూమి పుత్రుడైన మహాది జాంబవంతుని విగ్రహాన్ని 2005 లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కోళ్ల పడకల్ గ్రామంలో, 2007 లో జనగామ ప్రాంతం హన్మంతాపూర్ లో, 2012లో మేడ్చల్ మండలం శ్రీరంగవరం గ్రామంలో ఆవిష్కరించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక బీసీ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి బీసీ “హిందూ బీసీ మహాసభ” ఏర్పాటు చేసుకుని, హిందూ బీసీ మహాసభ ఆధ్వర్యంలో రైతుల, కార్మికుల అనేక సమస్యల మీద పోరాటాలు, సభలు, సమావేశాలు నిర్వహించుకున్నాం. 2024 మార్చి ఒకటి నుండి మార్చి 20 వరకు “చట్టసభలలో బీసీ దామాషా వాటా” కోసం పాదయాత్ర నిర్వహించినం. కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోరుతూ 2024 ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 5 వరకు హైదరాబాదులో, 2025 ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ 22 వరకు హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర పటేల్ ఆమరణ దీక్షతో బీసీ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. అయితే ఈ ఉద్యమానికి మద్దతుగా నిలబడాల్సిన బాధ్యత, అవసరం కూడా మిగతా వర్గాలకు ఉంటుంది. బీసీ సమస్యే దేశ సమస్య అన్న మాన్యశ్రీ కాన్షీరామ్ స్ఫూర్తితో ఎస్సీ, ఎస్టీలు మద్దతుగా నిలబడాలి.
మహాత్మ జ్యోతిబాపూలేను తన గురువుగా ప్రకటించుకున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అప్పటికున్న అనేక పరిమితుల మధ్యన రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో రిజర్వేషన్ పొందుపరిచాడు. ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రాతినిధ్యం అయితే వచ్చింది గాని సంపదలో వాటా అందని పండుగానే ఉన్నది. సంపదలో వాటా లేనంత వరకు ఎస్సీ, ఎస్టీల బతుకు మారేదేమిలేదు. బీసీలు జనాభా దామాషా ఈ దేశపు అత్యున్నత చట్టసభ పార్లమెంటులో అడుగు పెట్టలేనంత వరకు ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగే అవకాశం లేదు. పది శాతం ఉన్న అగ్రకులాలు దేశ సంపదలను డ్యూటీ చేయడానికి, కావాల్సిన చట్టాలు రూపొందించుకోవడానికి పార్లమెంటును కబ్జా చేస్తున్నారు. గతంలో పార్లమెంటును పందుల దొడ్డిగా మారిందని అభివర్ణించుకుంటే అనుకుంటే ప్రస్తుతం వేట కుక్కలదొడ్డిగా మారిపోయింది. బ్రాహ్మణాధిపత్యాన్ని బలపరుచుకోవడం బనియా కులపు ఆదాని, అంబానీ… ల దోపిడీకి అనుకూలంగా చట్టాలు రూపు దిద్దుకుంటాయి. దేశ ప్రజలను పేదరికంలోకి నెట్టివేయడం జరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది ధనవంతులు మనదేశంలోనే ఉంటారు. అత్యంత పేదలు దేశంలోనే ఉంటారు. ఏ దేశంలో లేనంత క్షయ వ్యాధిగ్రస్తులు ఈ దేశంలో ఉండడాన్ని బట్టి అంచనా దేశాన్ని అంచనా వేసుకోవాలి. ఇటువంటి పరిస్థితికి కారణం ఏ దేశంలో లేనటువంటి దుర్మార్గమైన కుల వ్యవస్థ ఈ దేశంలో ఉండడమే. ఇటువంటి దుర్మార్గమైన ఆపదను తెచ్చిపెట్టిన వారు కచ్చితంగా ఈ దేశ మట్టితో, ప్రజలతో సంబంధం లేని వారే అయి ఉండాలి. వారు విదేశీ ఆర్యులేనన్నది చారిత్రక సత్యం.
ఈ దేశానికి దురాక్రమణదారులుగా వచ్చిన వలస ఆర్యులు ప్రశాంతంగా జీవిస్తున్న ఈ దేశ మూలవాసులపై తమ సామ దాన భేద దండోపాయాలతో దాడులు చేసి ఓడిన మూలవాసులను శూద్రులుగా చేసి, తమ వర్ణం తెలుపు వర్ణం ఆధారంగా వర్ణ బానిస వ్యవస్థను ఏర్పాటు చేసిండ్రు. బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య పై మూడు వర్ణాలుగా వారున్నారు. శూద్రులను ఓడిన క్రమంలో నిచ్చెన మెట్ల కులాలుగా వేల కులాలుగా చీల్చారు. కంచం పొత్తు మంచం పొత్తు తెంచి వేశారు. నిచ్చెన మెట్ల కుల సమాజం, ఊరు-వాడ విభజన, ఊరు మెజార్టీ-వాడ మైనారిటీ, అంటరాని వాడ, అంతస్తులు వారీగా అంటరానితనం… లక్షణాలతో ఒక కులానికి మరో కులానికి ఆత్మీయతలు లేని సమాజాన్ని ఏర్పాటు చేశారు. చివరగా మూలవాసుల దేశం పేరు జంబుద్వీపాన్ని భారతదేశంగా మార్చేశారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సింధు నాగరికతకు సంబంధంలేదు. వీరు హిందువులు కాదు. ఈ దేశ మూలవాసులైన హిందువులకు బంధువులు కాదు. ఈ మధ్యకాలంలో వచ్చిన శాస్త్రీయ పరిశోధనలు కూడా ఈ దేశం మూలవాసులైన శూద్రుల డిఎన్ఏ తో వారి DNA వేరుగా ఉందని రుజువయింది. బ్రాహ్మణ రూపురేఖలు శూద్రుల రూపురేఖలు భిన్నంగా ఉంటాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు తెలుపుగాను ఈ దేశ మూలవాసులు నలుపుగాను ఉంటారు. ఈ దేశం భూమధ్యరేఖ సమీపంలో ఉన్న ఖండము. కనుక నల్లజాతి నివసించే ప్రాంతం. కర్రే బాపోనోన్ని, !ఎర్ర మాదిగోన్ని! నమ్మొద్దని ఒక నానుడి కూడా జనంలో ఉంటుంది. దీని ప్రకారం ఇద్దరు వేరు వేరు అని అర్థమవుతుంది. బ్రాహ్మణ యాస భాషలు మూలవాసి భాష యాసలతో వేరుగా ఉంటాయి. బ్రాహ్మణుల దేవతలు శూద్రుల దేవతలు ఒకటి కాదు. సహజంగానే వలస వచ్చిన వారు జనాభా రీత్యా తక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ దేశంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మూడు వర్ణాలు కలిపినా పది శాతం లోపే ఉంటారు.
వీరి మనువాద సిద్ధాంత విషాన్ని మింగిన తెలంగాణ రెడ్డి వర్గం తెలంగాణలో మనువాద వ్యవస్థను బలపరచడానికి చారిత్రకంగానే తీవ్ర ప్రయత్నం చేస్తూ వచ్చింది. రెడ్డి రాజులుగా రాజ్యాలేలి కుల వ్యవస్థ బలపరుస్తూ వచ్చారు. వీరి తలకెక్కిన మనువాద విషానికి విరుగుడు మందువేయకుండా సమాజం ఎంత మాత్రం ముందు పోలేదు. గత చరిత్ర జ్ఞాపకాలను చరిత్రలో ఉన్న రక్త బంధుత్వాన్ని గుర్తు చేసుకోవడం ద్వారానే ఎస్సీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలు ఆత్మీయతను పెంపొందించుకోగలుగుతాయి. తద్వారానే బలమైన ఐక్యత ఏర్పడుతుంది. బలమైన ఐక్యత ద్వారానే బలమైన ఉద్యమం బలమైన ఉద్యమం తోనే రాజ్యాధికారానికి రాజ మార్గం ఏర్పడుతుంది. ఆత్మీయత ఐక్యత రాజ్యాధికారాన్ని సాధించాలని కుల వ్యవస్థ అట్టడుగులు చేర్చబడ్డ మాదిగల్ని కలుపుకొని ఆశయంతో “మాదుగుల్ల కలుద్దాం, జంబూ రాజ్యం స్థాపిద్దామని” జంబుద్వీప జన జాతర నినదిస్తుంది.
సమత మమతల సమాజం కోసం సిద్ధం కండి ,
కాబట్టి, తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులారా!
సమతా మమతల మహాజన సమాజ నిర్మాణం కోసం జరిగే ఈ బీసీ రాజ్యాధికార యుద్ధాన్ని బలంగా నిర్వహించడానికి బలమైన ఐక్యత, లోతైన చారిత్రక దృక్పథంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజల గత రక్త బంధాలను గుర్తు చేసుకోవడానికి జరిగే
ఈ జంబుద్వీప జన జాతర-బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల యాతరను జయప్రదం చేయాలని కోరుతూ…
ఉద్యమాభి వందనాలతో…
సామాజిక ఉద్యమ కారులు మాజీ విప్లవ నేత
బత్తుల సిద్దేశ్వర పటేల్
జాతీయ అధ్యక్షులు
హిందూ బీసీ మాహాసభ
9704672813
