ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ-తాండూర్ అంబేద్కర్ చౌక్ లో జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో నిరసన,

 

 

 

 

 

 

నిరసన

Kura Yadaiah|November 1,2025,

హిందు 9 న్యూస్ బ్యూరో :

ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరుతూ తాండూర్ అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ బీసీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు……

తాండూర్ : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ తాండూర్ పట్టణం నందు శనివారం రోజు జాతీయ బీసీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. చాలాసార్లు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వానికి విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు ను రాజకీయ అవసరాల కోసం బలి చేయడం సమతమైనది కాదని రాజ్ కుమార్ తెలిపారు. వేలాది రూపాయల బకాయిలు విడుదల కాకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దానివల్ల వారిని చదువులకు ఆటంకం ఏర్పడుతున్నదని ప్రభుత్వంపై  Rajkumar ఆగ్రహం వ్యక్తం చేశారు . R Krishnainah పోరాట ఫలితంగానే ఆనాటి ప్రభుత్వం 2008లో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చిందని దానివల్ల అనేక పేద బడుగు బలహీన పీడిత వర్గాలకు సంబంధించిన పిల్లలు చక్కని చదువులు చదువుకొని విద్యావంతులు కాగలిగారని Rajkumr అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఒకవేళ బీసీ సంఘాలు ఉద్యమం చేపడితే ఎలా ఉంటుందో తాండూర్ లో ఈరోజు జరిగిన ఈ నిరసన కార్యక్రమం ఒక ఉదాహరణగా బాధించాలని హితవు పలికారు. ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో బీసీ నేతలు బీసీ మహిళలు నిరసన కార్యక్రమంలో చేపట్టడానికి కారణం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొట్లాడడమేనని అన్నారు. ఇప్పటి కైనా ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి బడుగు బలహీన వర్గాల విద్యార్థి లోకాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సయ్యద్ సుకుర్ గడ్డం వెంకటేష్ , మహిళా అధ్యక్షురాలు అనిత కార్యదర్శిలు విజయలక్ష్మి వీరమని యాలాల మండల అధ్యక్షులు లక్ష్మణ చారి మీడియా ఇన్చార్జ్ బసవరాజ్ టైలర్ రమేష్ పరమేష్ మధుసూదన్ కిరణ్ వినయ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *