
దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కర్ణాటకలో అత్యంత పవిత్రమైన, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలలో *ధర్మస్థల* ఒకటి. ఇక్కడ ప్రతిరోజూ వేలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం వస్తుంటారు. అయితే, గత కొద్ది కాలంగా ఈ ఆధ్యాత్మిక క్షేత్రం అనుమానాస్పద మరణాలు, అదృశ్యాలు, ఆత్మహత్యల కేసులతో వార్తల్లో నిలుస్తోంది. ఇది భక్తులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో, ఇలాంటి ఘటనలు పెరగడం నిజంగా మిస్టరీని పెంచుతోంది.
తాజాగా శ్రీక్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను పూడ్చి పెట్టానని ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ చోట గురువారం కొన్ని అవశేషాలను గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం. పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదు నేపథ్యంలో ఈ అనుమానాస్పద మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గత సోమవారం నుంచి సిట్ అధికారులు.. అతడిని వెంట తీసుకెళ్లి దర్యాప్తు చేపట్టారు
