Speaker|కళాఖండాలతో తెలంగాణ రాష్ట్రానికి వన్నెతెచ్చిన అభినందనీయుడు శిల్పి బసవరాజ్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,

Speaker|  కళాఖండాలతో తెలంగాణ రాష్ట్రానికి వన్నెతెచ్చిన అభినందనీయుడు శిల్పి బసవరాజు అని వికారాబాద్ జిల్లా పట్లూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ సందర్భంగా అన్నారు…

Speaker|మర్పల్లి:  కళాఖండాలతో తెలంగాణ రాష్ట్రానికి వన్నెతెచ్చిన శిల్పి బసవరాజ్ అని ఆయన ఎంతో అభినందనీయుడని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ ఖాసీం లతో కలిసి ఆదివారం రోజు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు.

విగ్రహం రూపొందించిన శిల్పి బసవరాజ్ ఎన్నో విగ్రహాలకు రూపకల్పన చేసి తెలంగాణ రాష్ట్రానికి వన్నె తీసుకొచ్చిన అభినందనీయుడని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్లూరులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం మూడవ అతిపెద్ద విగ్రహంగా ఉండటం చాలా సంతోషకరమైన అంశమని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ విగ్రహాల రూపకల్పన చేస్తున్న శిల్పి సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండల కేంద్రానికి చెందిన బసవరాజ్ ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాలకు అనేక మహనీయుల విగ్రహాలను శిల్పంగా చెక్కి రూపకల్పన చేసిన ఘనత బసవరాజుకే దక్కుతుందని కొనియాడారు. మహాత్మా బసవేశ్వరుడు శివాజీ స్వామి వివేకానంద భక్త రామదాసు భగత్ సింగ్ రాణా ప్రతాప్ గౌతమ బుద్ధుడు కొమరం భీమ్ మదర్ తెరిసా చాకలి ఐలమ్మ ప్రొఫెసర్ జయశంకర్ ఇలా అనేక మంది మహనీయుల విగ్రహాలను తమ హస్తాలతో శిల్పిలను చేయడంలో ప్రత్యేకత చాటుకున్నారని పేర్కొన్నారు. బసవరాజును స్పీకర్ చేతుల మీదుగా పూలమాలతో సత్కరించారు కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *