Child labour| విజయవంతమైన ఆపరేషన్ ముస్కాన్,X1, 160 మంది బాల కార్మికులకు విముక్తి, వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి

Child labour|  వికారాబాద్ జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ X1 విజయవంతమైయిందని,  160 మంది బాల కార్మికులకు విముక్తి, కల్పించామని ఈ ఆపరేషన్ ముస్కాన్ కు సహకరించిన అధికారులందరినీ అభినందిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు…….

Child labour|వికారాబాద్ :  వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ X1 విజయవంతమైందని 160 మంది బాల కార్మికులకు ఆపరేషన్ ముస్కాన్ ద్వారా విముక్తి కలిగించమని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ప్రకటించారు. ఎస్పీ ఆదేశాల మేరకు AHTU టీమ్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ ఎస్.కె అన్వర్ పాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. జూలై 1 నుండి 31 వరకు నిర్వహించిన ఈ ఆపరేషన్ లో దాదాపుగా జిల్లాలో 160 మంది బాల కార్మికులను రక్షించామని ఆయన తెలిపారు.

రక్షించబడిన వారిలో 145 మంది బాలురు, 15 మంది బాలికలు, ఉన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 119 అయితే, అందులో 106 బాలురు, 13 మంది బాలికలు, ఉన్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు మొత్తం 41 మంది ,అందులో 39 మంది బాలురు, 2 బాలికలను రక్షించడం జరిగిందని, 20 మంది ఎఫ్ఐఆర్ లు మరియు 65 మంది IR లో నమోదు చేయడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు.

బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి,

బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత సమాజంపై ఉందని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అది మనందరి బాధ్యతగా గుర్తించాల్సిన అంశం అని వారు పేర్కొన్నారు. ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సబ్ డివిజన్ వారీగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారుల కృషితో వారి సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ X1 విజయవంతం అయిందని దీనికి సహకరించిన ప్రతి ఒక్క అధికారిని అభినందిస్తున్నట్లు ఎస్పి పేర్కొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *