సమర్థమైన నాయకత్వం ఎలా?

సమర్థ నాయకత్వం

Kura Yadaiah/ October 6,2025

నాయకత్వం ఆషామాషీ కాదు సమర్థవైన రాజకీయం సమర్థ నాయకత్వం అవసరం లక్ష సాధన ముఖ్యమైన అంశం వాటికి సమర్ధమైన నాయకత్వ లక్షణాలు కూడా అతి ముఖ్యమైనవి….

హిందు 9 న్యూస్ ప్రత్యేక ప్రతినిధి :

నాయకత్వం ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక ఉద్యోగి తన ఉద్యోగం జాగ్రత్తగా చేసుకోవాలంటే సాధ్యమే. ఒక వ్యాపారి లాభం సాధించాలంటే కష్టపడితే సాధ్యమే. కానీ నాయకుడు తన వద్ద పనిచేసే నలుగురిని కలుపుకుని పోతూ వారిని ముందుకు తీసుకపోవడం సాధ్యమే కానీ కష్ట సాధ్యం. కారణం ఏమంటే తన వద్ద పని చేసే వారి మనస్తత్వాలను అర్థం చేసుకుంటూ వారికి ఎప్పటికప్పుడు ఉద్యోగంలో ప్రేరణ కలిగిస్తూ వారి సమర్థతను పెంచుకుంటూ ఉత్సవముతో ప్రేరణ కలిగిస్తూ ఉండాలి. మీదొక్క సంస్థ కావచ్చు ప్రభుత్వ కార్యాలయం కావచ్చు రాజకీయ పార్టీ కావచ్చు సమర్ధుడైన నాయకుడిగా పేరు తెచ్చుకోవాలంటే ఇక్కడ కొన్ని గమనించాల్సినవి ఉన్నాయి.

1, లక్ష నిర్ణయం,

2, తగిన నిర్ణయం,

3, చర్చలు చర్యలు,

ఒకసారి లక్ష్య నిర్ణయం గురించి మాట్లాడుకుంటే,

 

నాయకత్వ లక్షణాలలో ఇది కీలకమైనది మీరు వ్యక్తిగతంగా కానీ సమర్థవంతంగా కానీ ఎటువంటి విజయాలను సాధించాలనుకుంటున్నారు. స్పష్టమైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదే మీ లక్ష్యమని గుర్తించండి. మీ లక్ష్యం స్పష్టంగా కొలవ దగ్గదిగా ఉండాలి. వాస్తవానికి దగ్గరగా ఉండాలి తప్ప మరి అసాధ్యంగా ఉండకూడదు.

ఉదాహరణకి 40 ఏళ్లు దాటిన వ్యక్తి ఐఏఎస్ అధికారి కావాలనుకోవడం కాలు విరిగిన వ్యక్తి క్రికెట్ ఆటగాడు అవ్వాలనుకోవడం.ఎన్నికలు లేని సమయంలో ఎమ్మెల్యే కావాలనుకోవడం వట్టిమన్నమాట. సమర్ధుడైన నాయకుడు దృఢ నిక్షయంతో అసాధ్యంగా అనిపించే లక్ష్యాలను కూడా సుసాధ్యం చేయగలుగుతాడు. అవి అసాధ్యమనిపిస్తాయి తప్ప నిజం కాదు.

ఉదాహరణకు మన పురాణాలలో పుష్పకవిమానం గురించి చదివాం అంతరిక్షయానం గురించి చదివాం ఇవన్నీ మత గ్రంథాల్లో ఉన్నాయి. రైతు సోదరులు అది సాధించడం తమ లక్ష్యంగా ఎంచుకున్నారు. ఖచ్చితమైన మనోవైఖరి సంకల్పంతో ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఉన్న సాధించగలిగారు. దానికి తగిన ప్రణాళిక తీసుకొని వనరులు కూర్చుకొని పని వారిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగినందు వల్లనే విజయం వారిని వరించింది. లేదా అదొక పురాణ కథలాగే మిగిలిపోయి ఉండేది. లక్ష్యసాధన సమయంలో ఊహించని ఇబ్బందులు అసంతృప్తులు విపత్తులు సంభవించటం సహజమే అవి తట్టుకోవాలి వాటిని అధిగమించాలి లక్ష్యసాధనలో అవి తప్పవు. ఆశయ సిద్దికై అవి భరించి మీ ప్రణాళికను మళ్లీ గాడిలో ఉంచగలిగాలి అవసరమైతే లక్ష్యం మరోసారి విశ్లేషించి చిన్నచిన్న మార్పులు చేయండి. ఆచరణ సాధ్యమైన ప్రత్యామ్నాయల పై ఆధారపడడంలో తప్పులేదు. అయితే మాత్రం అంతిమ లక్ష్యాన్ని మరచిపోకూడదు నిష్పాక్షపతంగా విశ్లేషణ చేసుకుంటూ ఆటంకాలను అధిగమిస్తూ అవసరమైన మార్పులు చేర్పులతో ముందుకు సాగిపోవాలి.

లక్ష నిర్ణయం చేసుకునే సమయంలో దాని సాధ్యాసాధ్యాలతో పాటు దాని భవిష్యత్తుని కూడా ఊహించగలగాలి. ఉదాహరణకి ఒక అధికారి లేదా ఒక మంత్రి తన కులం వారికి సహాయం చేద్దామనే ఉద్దేశంతో రూల్స్ కూడా పక్కనపెట్టి చేశాడు అనుకోండి! అక్కడికి తన లక్ష్యం నెరవేరింది అనుకుంటాడు. తనవారికి ప్రమోషన్ ఇవ్వడమే కాకుండా ఇతర కులాల వారిని అశ్రద్ధ కూడా చేసి తాను ఎంతో న్యాయం చేశాననుకుంటాడు కానీ దాని పర్యావసనం భవిష్యత్తులో చాలా ఘోరంగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన అధికారి ప్రతీకారం తీర్చుకోక మానడు అది కూడా ఒక్కరిద్దరి మీద కాదు మొత్తం ఆ కులం వాళ్లందరూ స్వార్థపరులని మరొక కులం వారిని బతకనీయరని కాబట్టి సమిష్టిగా అందరూ కలిసి ఆ కులం వాళ్లు అంతం చూడాలని బహిరంగంగానే ప్రకటిస్తాడు ఇప్పుడు మన దేశంలో చాలా సందర్భాలలో ఈ కులం ప్రాంతీయ విభేదాలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి అనేది అందరికీ తెలిసినదే. తమ సిద్ధాంతాన్ని సమర్ధించుకోవచ్చు కానీ ఇతర సిద్ధాంతాలను విమర్శించి నందు వలన వినాశనం తప్పదు. రష్యాలో దేవుడిలా కొలచిన లెనిన్ విగ్రహాల సంగతి ఏమయ్యింది? మన దేశంలో కూడా ఇప్పుడు పోటాపోటీగా ఆవిష్కరిస్తున్న గాంధీజీ అంబేద్కర్ల విగ్రహాల మీద కూడా దాడులు  మనం పత్రికల్లో చదువుతున్నాం! అందుకే నాయకుల తీరు మారాలి ఆచితూచి అడుగు వేయాలి సుమా!
నాయకత్వ లక్షణాలలో లక్ష నిర్ణయం తర్వాత కార్యనిర్వానలో తగిన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమైనది. తగిన అనడంలో ఉద్దేశ్యం ఏమిటంటే కొంతమంది నాయకులు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తుంటారు. అది కూడా ఒక రకమైన నిర్ణయమే కదా? అందుచేత తగిన నిర్ణయం తగిన సమయంలో తీసుకోవడం నాయకుడి బాధ్యత. కొన్ని నిర్ణయాలు వాటికవే జరుగుతాయి.
కొన్ని సందర్భాల్లో అదా? ఇదా? తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరికొన్ని వీటన్నిటికీ ప్రత్యామ్మానా యలు ఉంటాయి. అటువంటి సమయాలలో నాయకుడికి నిర్దిష్టమైన వైఖరి ఉండాలి కాలమే పరిష్కరిస్తుందని జడత్వం పనికిరాదు.

ఉదాహరణకు కాందహార్ విమానాశ్రయానికి టెర్రరిస్టులు మన విమానాన్ని ఐజాక్ చేసి తీసుకెళ్లారు. ఫలానా ఖైదీలను విడిచి పెడితేనే ప్రయాణికులను వదిలేస్తాం లేదా చంపేస్తామన్నారు! దానికి తక్షణ నిర్ణయం మన వాళ్లు తీసుకోలేకపోయారు. ఐదు రోజులపాటు చర్చలు సాగాయి అలా కాలయాపన చేయడం వలన టెర్రరిస్టుల నిర్ణయం మారుతుందని మనవాళ్లు భావించి ఉండవచ్చు! ఖైదీలను విడిచి పెట్టేలా ?వద్దా?
అనే తర్జనభర్జనలు జరిగాయి. చివరకు మన వాళ్లను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకొని ఖైదీలను విడుదల చేశారు ఆ సమయంలో అదే తగిన నిర్ణయం.
ఒక సమస్యను పరిష్కరించడానికి నిర్ణయం తీసుకునే ముందు నాయకుడు తమ సహచరుల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలి. వారు తమ భావాన్ని స్వేచ్ఛగా ప్రకటించే అవకాశం ఇవ్వాలి. తరువాత ఆ అభిప్రాయాల గురించి అందరితో చర్చించి ప్రత్యామ్నాయాలు విశ్లేషించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమమైన మార్గం అంతే తప్ప హిట్లర్ లాగా తమ అభిప్రాయమే సహచరుల అభిప్రాయం అని ముందుకు పోతే చివరకు అతనికి పట్టిన గతి పడుతుంది. అందువలన ఈ విషయంలో జాగ్రత్త పడాలి. నిర్ణయం తీసుకునే ముందు విజన్ ముఖ్యమంటారు.

మేనేజ్మెంట్ గురువులు దానికి పది స్టెప్స్ ఉంటాయి అవి విజయానికి సోపానాలు.అవి ఏమిటో ఒకసారి చూద్దాం.

సమస్య ఏమిటి పరిష్కారం సాధ్యమేనా? ఏమిటా పరిష్కారం? ప్రత్యామ్నాయలు ఉన్నాయా? అవి సహచరులతో చర్చించండి ఉత్తమ నిర్ణయం ఎంపిక చేయండి ఎవరు ఏ పని చేయాలో నిర్ణయించండి నిర్ణయం అమలుపరచండి మధ్యలో వచ్చే సమస్యలను పరిష్కరించండి విజయం సాధించండి ఆ క్రెడిట్ అందరికీ పంచండి.

చర్చలు చర్యలు

ఒక సంస్థ పురోభివృద్ధి నాయకుడి మనోవైఖరి పై ఆధారపడి ఉంటుందనే సత్యం నిర్వివాదంశం ఎవరు చేయాల్సిన పనిని వారికి అప్పజెప్పి వారి వెనుక ఉండి గైడ్ చేస్తూ సహచరుల మధ్య సన్నిహిత్యం పెరిగే చర్యలు తీసుకుంటూ ముందుకు సాగాలి. ఒక సంస్థలో ఎన్నో రకాల కార్యకలాపాలు ఉంటాయి పరిపాలన పబ్లిక్ రిలేషన్ ఫైనాన్స్ సమన్వయకర్త టెక్నికల్ వ్యవహారాలు మార్కెటింగ్ అభ్యర్థుల కదలికలను గమనించి తగు మార్పులు చేర్పులు చేయడం ప్రజలకు దగ్గర కావడం ఇలా అనేక విభాగాలు ఉంటాయి అవి ఎవరికి ఇవ్వాలో జాగ్రత్తగా ఎన్నిక చేయాల్సిన బాధ్యత నాయకుడిదే. ఈ కాలంలో అన్ని సంస్థలు శిక్షణకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి
మాకు అన్నీ తెలుసు మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మేము కొత్తగా నేర్చుకునేదేముంది? అనే రోజులు పోయాయి చేంజ్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను అందరూ ఆహ్వానిస్తున్నారు ఇది చాలా మంచి మార్పు అందుచేత నాయకుడు తన సహచరులకు ఎప్పటికప్పుడు బయట వ్యక్తుల చేత శిక్షణ ఇప్పించాలి రోజూ వాళ్ళని మీటింగ్ కని పిలిచి తానే శిక్షణను ఇస్తే అదొక శిక్షగా భావించవచ్చు 500 కంపెనీలలో బయటి వారితో శిక్షణను నిపించడం సంస్థ  అనిపించడం సమస్త అధిపతి కూడా అందరితో పాటు కూర్చొని నోట్స్ రాసుకోవడం జరుగుతుంది. మన రాష్ట్రంలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హెచ్ఆర్డిఏ సంస్థలు కూడా జరిగే శిక్షణ కార్యక్రమాలలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా కూర్చొని వినడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానదు.

విశ్లేషించు పథకం వెయ్యి, చర్య తీసుకో

పరిస్థితిని జాగ్రత్తగా విశ్లేషించాలి రెండవది అది ఎలా సాధించాలో పథకం వేయాలి మూడవది తగిన చర్య చేపట్టాలి అయితే ఒక విషయం మూడవ చర్య తీసుకోలేని పక్షంలో మొదటి రెండు సోపానాలు పనికిమాలిన వే అంటాడు పీటర్ డ్రక్కర్ ఎన్నిఅవరోధాలు ఎదురైనా వాటిని గమనిస్తూ ముందుకు సాగాలి,

బివీ పట్టాభిరామ్ రచయిత..

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *