జిల్లాలో అక్రమ దందాలపై ఉక్కు పాదం మోపుతాం, వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా,

ప్రెస్ నోట్ ఆధారిత వార్తలు,

హిందు 9న్యూస్ 24/3/2026/

 

_______సహజ వనరులు అక్రమంగా తరలిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు, చట్టపరమైన చర్యలకు పోలీస్ శాఖ సిద్ధమే, ఎస్పి శ్రీమతి స్నేహమెహ్రా,

జిల్లాలో అక్రమ దంతాలపై ఉక్కు పాదం మోపుతామని ఎంతటి వారైనా కఠినమైన చర్యలు తీసుకొని సహజ వనరుల కట్టడికి పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సన్నతమవుతుందని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా వెల్లడించారు……

 వికారాబాద్ జిల్లా బ్యూరో :  వికారాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా అక్రమ మైనింగ్ ఇతర అక్రమ దందాలపై ఉక్కు పాదం మోపాలని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా గతంలో ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే,

ఎస్పీ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు  దాడులు చేస్తున్నారు. అక్రమ దందాలపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలను బట్టి చూస్తే పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అక్రమ రవాణాను అరికట్టడానికి పూర్తిస్థాయిలో సన్నతమైందని అర్థమవుతున్నది.

_యాలాల్ మండల్ లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ట్రాక్టర్ల సీజ్,

ఇందులో భాగంగా గత వారం రోజుల నుండి జిల్లాలో 13 అక్రమ రవాణా కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా వెల్లడించారు.సోమ వారం రాత్రి యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఎనిమిది ట్రాక్టర్లను, కరణ్ కోట్ ప్రాంతంలో అక్రమంగా కలప తరలిస్తున్న ఒక లారీని సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు.

గత వారం రోజుల క్రితం నవా పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రమట్టి అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న మూడు లారీలు సీజ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో  కేసులు నమోదు చేసినట్లు ఆమె స్పష్టం చేశారు.

అయితే వికారాబాద్ జిల్లాలో అక్రమ రవాణా కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆమె పేర్కొన్నారు.

ఎక్కడైనా అనుమానస్పద రవాణా కనిపించిన వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇందుకోసం జిల్లాలో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి రాత్రి పూట నిరంతరం తనిఖీలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సహజ వనరుల జోలికొస్తే అంతే సంగతి,

సహజ వనరులను తరలించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె ఘాటుగా హెచ్చరించారు. ఇప్పటివరకు టాస్క్ ఫోర్స్ అధికారులు జనవరి నెలలో 22 అక్రమ రవాణా కేసులు ఫిబ్రవరి నెలలో 9 అక్రమ రవాణా కేసులు మార్చి నెలలో 20 మొత్తం ఈ సంవత్సరానికి గాను 50 యొక్క అక్రమ రవాణా కేసులు నమోదు చేసినట్లు ఎస్పి చెప్పారు.

ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సహజ వనరుల అక్రమ రవాణాను కట్టడి చేయడానికి పోలీస్ శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన  చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని ఘాటుగా హెచ్చరించారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *