బిజినెస్
Kura yadaiah| September 25,2025,

తెలంగాణ లో కొత్త మద్యం దుకాణాలకు రేపట్నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఎక్సైజ్ శాఖ ముహూర్తం ఖరారు చేసింది……..
హైదరాబాద్: తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్‌కు మార్గదర్శకాలు జారీ చేశారు. కొత్త మద్యం దుకాణాలకు రేపట్నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. రెండేళ్ల కాలానికి(2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు) అనుమతులతో ఎక్సైజ్ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది.

కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుం రూ.3 లక్షలుగా నిర్ధరించారు. ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు దుకాణాలు పొందేందుకు అనర్హులు.
