తెలంగాణలో రేపటి నుంచి కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ,

బిజినెస్ 

Kura yadaiah| September 25,2025,

తెలంగాణ లో  కొత్త మద్యం దుకాణాలకు రేపట్నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఎక్సైజ్ శాఖ ముహూర్తం ఖరారు చేసింది……..

హైదరాబాద్‌: తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్‌కు మార్గదర్శకాలు జారీ చేశారు. కొత్త మద్యం దుకాణాలకు రేపట్నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. రెండేళ్ల కాలానికి(2025 డిసెంబర్‌ 1 నుంచి 2027 నవంబర్‌ 30 వరకు) అనుమతులతో ఎక్సైజ్‌ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది.

కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుం రూ.3 లక్షలుగా నిర్ధరించారు. ఎక్సైజ్‌ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు దుకాణాలు పొందేందుకు అనర్హులు.

Exit mobile version