బిజినెస్
Kura Yadaiah/September 22,2025,

ప్రభుత్వ చీఫ్ పి, మహేందర్ రెడ్డిని తాండూర్ స్టోన్ క్వారి మర్చంట్ అసోసియేషన్ సభ్యులు సోమవారం రోజు తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు….
తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ స్టోన్ వారి మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం రోజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
నాపరాతి వ్యాపారస్తులకు సహకరించాలని అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డిని కోరారు. స్పందించిన పట్నం మహేందర్ రెడ్డి తాండూరులో నాపరాతి వ్యాపారాలు సజావుగా సాగేందుకు వాణిజ్యపరంగా తాండూర్ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు తన వంతు తప్పకుండా కృషిచేసి ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత వ్యాపారస్తులకు అండగా నిలబడతానని మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. తాండూర్ వ్యాపారస్తులు ప్రజలు అభివృద్ధి చెందితే తనకు కూడా ఎంతో గౌరవంగా ఉంటుందని ఆ దిశగా తప్పకుండా కృషి చేస్తానని భరోసానిచ్చారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు స్టోన్ మర్చంట్ అసోసియేషన్కు ఎన్నో సహాయ సహకారాలు అందించానని ఆ దిశగానే ఇప్పుడు కూడా తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. గతంలో మహేందర్ రెడ్డి తాండూరు అభివృద్ధి పట్ల చేసిన కృషికి హర్షించదగ్గ విషయమని వ్యాపారస్తులు తెలిపారు.
